యేసు యొద్దకు నడిపించే ఒక ఏకీకృత గాధగా బైబిలును ప్రజలు తామంతట తాము తెలుసుకునేలా వారికి సహాయపడడమే మా లక్ష్యం.
వీడియోలు
చదువు ప్రణాళికలు
BibleProject గురించి

BibleProject యునైటెడ్ స్టేట్స్ కేంద్రంగా స్వచ్ఛంద విరాళాలతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిర్వహించబడుతుంది. బైబిలును యేసు వైపు నడిపించే ఒక ఏకీకృత గాధగా ప్రజలు అనుభవించడానికి ఉచిత వీడియోలు, ఇతర వనరులు మేము రూపొందిస్తాము. బైబిల్ గురించి మరింత తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారికి, సంక్లిష్టమైన బైబిల్ భావనలను స్పష్టంగా మరియు సులభంగా అర్థమయ్యేలా చేయడమే మా లక్ష్యం. మా పండితులు విభిన్న క్రైస్తవ సంప్రదాయాల నుండి వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్త సంఘాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ప్రతిదీ రూపొందిస్తాము.
డాక్టర్ టిమ్ మాక్ మరియు జాన్ కొలిన్స్ వీరిద్దరు 2014లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. సుమారు 50 దేశాల 140 మంది విభిన్న భాషల్లో ప్రతినిధులు దేవుని వాక్య పరిచర్యను ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేస్తున్నారు. ఈ వాక్య పరిచర్య 50 భాషల్లో దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అందించబడుతుంది. లేఖనాల పట్ల మా విధానం గురించి మీరు ఇక్కడ మరింత తెలుసుకోవచ్చు.
మీలాంటి ఉదార స్వభావం గల మద్దతుదారుల కారణంగా, మేము రూపొందించే ప్రతిదీ ఉచితంగా లభిస్తుంది.