వాడుక నిబంధనలు |
బైబిల్ప్రాజెక్ట్ |
సెప్టెంబర్ 2019 లో అప్డేట్ చేయబడింది. |
బైబిల్ ప్రాజెక్ట్‌కు స్వాగతం - మీరు దీనిని సందర్శించినందుకు మేము సంతోషిస్తున్నాము. |
బైబిల్ ప్రాజెక్ట్ ద్వారా మా ఉత్పత్తులను, ప్రపంచవ్యాప్తంగా వీలైనన్ని సమూహాలతోనూ మరియు ఎక్కువ మంది వ్యక్తులతోనూ పంచుకోగలమని విశ్వసిస్తున్నాము. మా వీడియోలు, పోస్టర్లు, గమనికలు మరియు ఇతర విషయాలను మత నాయకులు మరియు విద్యావేత్తలు, బైబిల్ జ్ఞానాన్ని పెంచుకోవడం మరియు బైబిల్ విషయాలను చర్చించడం కొరకు ఉచితంగా వాడుకుంటారని ఆశిస్తున్నాము. ఈ వాడుక నిబంధనలు (కొన్నిసార్లు "నిబంధనలు" అని పిలువబడతాయి) మా విషయాలను దురుపయోగం లేదా దుర్వినియోగం నుండి కాపాడడానికి, అదే విధంగా మా ఖ్యాతిని రక్షించడం అనే లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించబడినవి. మా సృజనాత్మకతను వినియోగించుకోవాలనుకుంటే, ఈ నిబంధనలు పాటించవలసి ఉంటుంది. మా సంస్థ యునైటెడ్ స్టేట్స్‌లోని ఒరెగాన్ రాష్ట్ర చట్టాల ప్రకారం నిర్వహించబడే ఒక లాభాపేక్షలేని సంస్థ, అయినప్పటికీ మేము ప్రపంచ దృక్పథాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తాము. ఈ నిబంధనలలో, మమ్మల్ని "మేము", "మాకు", "మాయొక్క", "TBP ", "ది బైబిల్ ప్రాజెక్ట్" లేదా, "బైబిల్ ప్రాజెక్ట్" అని సూచించవచ్చు. |
మా గోప్యతా నోటీసుతో మా వెబ్నిసైట్ను నియంత్రించే నిబంధనలు; సోషల్ మీడియా పేజీలు, ఛానెల్‌లు మరియు ఇతర TBL ఆన్లైన్ యొక్క ఉనికి (సమిష్టిగా, "వెబ్సైట్") మొదలగువాటి ఉపయోగాన్ని నియంత్రిస్తాయి. మీరు వెబ్‌సైట్‌ను వినియాగాన్ని ప్రారంభించడానికి ముందుగా దయచేసి ఈ నిబంధనలను జాగ్రత్తగా చదవండి. |
|
అంగీకారం |
మా సేవలను యాక్సెస్ చేయడానికి, బ్రౌజ్ చేయడానికి లేదా ఉపయోగించడానికి మీరు వెబ్సైట్, కంటెంట్ (క్రింద నిర్వచించినవి) లేదా మా ఉత్పత్తులు లేదా సేవలను ఉపయోగిస్తున్నంత కాలం మీరు ఈ నిబంధనలకు బేషరతుగా కట్టుబడి ఉంటామని అంగీకరించాలి మరియు సమ్మతించాలి. మీరు ఈ నిబంధనలను అంగీకరించనట్లైతే మరియు సమ్మతించకపోతే, మీరు ఈ సేవలను ఉపయోగించలేరు. మీ అంగీకారం చట్టబద్ధమైన ఒప్పందాన్ని కలిగి ఉంటుంది. వెబ్సైట్ మరియు కంటెంట్ యొక్క మీ ఉపయోగానికి సంబంధించి మీకు మరియు బైబిల్ ప్రాజెక్ట్‌కు మధ్య కుదుర్చుకున్న ఒప్పందం నిబంధనలకు లోబడి చట్టం ద్వారా అనుమతించబడి పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. మా షరతులలో ఏదైనా హక్కు లేదా నియమము అమలు చేయడంలో మా వైఫల్యం అటువంటి హక్కు లేదా నిబంధన యొక్క మాఫీ చేయబడే దిశగా పనిచేయదు. |
ఈ షరతులు లేదా సేవలకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు, సందేహాలు లేదా ఆందోళనలు ఉన్నట్లైతే, దయచేసి మమ్మల్ని webmaster@jointhebibleproject.com పై లేదా టోల్ ఫ్రీ (855) 700-9109 పై సంప్రదించండి |
సమీక్ష |
బైబిల్ ప్రాజెక్ట్ ఏదైనా ఒక నిర్దిష్టమైన క్రైస్తవ వర్గం లేదా సంప్రదాయంలో భాగం కాదు. అన్ని నేపథ్యాలకు సంబంధించిన ప్రజలు వారివారి మత లేదా మతేతర విశ్వాసాలతో సంబంధం లేకుండా మా పనిలో విలువలను కనుగొంటారని మేము ఆశిస్తున్నాము. మా లక్ష్యం ఏదైనా ఒక నిర్దిష్టమైన క్రైస్తవ సాంప్రదాయం యొక్క విలక్షణమైన బోధనలను ప్రోత్సహించడమే కాదుగాని, దాని చారిత్రక మరియు సాంస్కృతిక సందర్భాన్ని తీవ్రంగా పరిగణించే బైబిల్ యొక్క కవితా- మరియు కథనం-కేంద్రీకృత పఠనం నుండి ఉద్భవించే వేదాంత ఇతివృత్తాలు మరియు ఆలోచనలను అన్వేషించడం. కొన్ని సందర్భాల్లో మన వ్యాఖ్యానం మరియు వేదాంతపరమైన అంకితభావం స్పష్టంగా కనిపించే బైబిల్ యొక్క భాగాలను అన్వేషించడంతో ముగుస్తుంది,కానీ లేఖనాల కథనాలు మరియు వేదాంత వాదనలు తమకు తాముగా వివరించేటట్లుగా ఉంచడం మా ప్రధాన లక్ష్యం. |
మేము బైబిల్ వ్యాఖ్యానంలో క్రైస్తవ మత ఐక్యతా సూత్రానికి కట్టుబడి ఉన్నాము, అలాగే ఆ వివరణాత్మక వ్యాఖ్యాపరమైన పని కోసం వనరులు మరియు పద్దతుల ఎంపికను చేకూర్చడం జరిగింది, ఒక అంశాన్ని నిరూపించడానికి ప్రజలు మా కంటెంట్‌ను దాని సందర్భం నుండి వేరుపరచి చూడడం గురించి మేము ప్రత్యేకంగా ఆందోళన చెందుతున్నాము. అంతేకాకుండా, మాది ఒక లాభాపేక్షలేని సంస్థ కాబట్టి, మా కంటెంట్‌ను ఉపయోగించడం ద్వారా ఏదైనా వ్యక్తి లేదా సంస్థ లాభం పొందడాన్ని మేము వ్యతిరేకిస్తాము. మా కంటెంట్ నుండి లాభం పొందడానికి ప్రయత్నించడం లేదా కంటెంట్ యొక్క సందేశం, తీర్మానాలు, తర్కాలు లేదా మౌలికతను మార్చే విధంగా మా కంటెంట్‌ను ఉపయోగించడం లాంటివి నిబంధనలన ఉల్లంఘన క్రిందకు వస్తుంది మరియు కంటెంట్‌ను ఉపయోగించుకునే మీ హక్కును కోల్పోయేలా చేస్తుంది. |
ఈ నిబంధనలు మా వీడియోలు, పోస్టర్లు, నోట్స్, పాడ్‌కాస్ట్‌లు మరియు ఇతర ఆడియో రికార్డింగ్‌లు మరియు bibleproject.com వంటి మా వెబ్సైట్ మరియు ఇతర సామగ్రి మరియు కార్యాచరణ, అలాగే మా సోషల్ మీడియా పేజీలలో లేదా మా YouTube మరియు Vimeo ఛానెల్స్ (సమిష్టిగా, "కంటెంట్") వంటి మా మీడియా స్ట్రీమింగ్ పేజీలలోని ఏదైనా కంటెంట్‌కు వర్తిస్తాయి. ఈ నిబంధనలలో స్పష్టంగా పేర్కొన్నకంటెంట్ తప్ప వేరే ఏదీ ఉపయోగించబడకపోవచ్చు. ఇతర కంపెనీలు TBP (సమిష్టిగా, "సర్వీస్ ప్రొవైడర్స్") కి హోస్టింగ్ లేదా ఇతర సేవలను అందించే మేరకు, మరియు ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ఉపయోగ నిబంధనలు ఏదైనా వెబ్సైట్లు, సోషల్ మీడియా పేజీలు, ఛానెల్‌లు లేదా కంటెంట్ కనిపించే ఇతర ఆన్లైన్ స్థానాలకు వర్తిస్తాయి, ఈ నిబంధనలు, ఆ నిబంధనలకు అదనంగా వర్తించేలా ఉద్దేశించబడినవి. |
వెబ్సైట్ లేదా కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి, బ్రౌజ్ చేయడానికి లేదా ఉపయోగించడానికి, మీరు ఈ నిబంధనలకు బేషరతుగా కట్టుబడి ఉంటామని అంగీకరించాలి. మీరు ఈ నిబంధనలను అంగీకరించనట్లయితే, మీరు కంటెంట్ లేదా వెబ్సైట్ లేదా మేము అందించే సేవలు లేదా కార్యాచరణను ఉపయోగించలేరు. |
నమోదు |
మా వెబ్సైట్ మీకు TBP యొక్క కార్యక్రమాలు మరియు సేవలకు సంబంధించిన సాధారణ సమాచారాన్ని అందిస్తుంది. ఈ నిబంధనల ప్రకారం న్యూస్‌లెటర్స్ మరియు ఇతర సమాచారాన్ని స్వీకరించడానికి, ఆన్లైన్ కొనుగోలు లేదా విరాళం ఇవ్వడానికి, కొన్ని రకాల కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి లేదా ఉపయోగించడానికి లేదా వెబ్సైట్లో ఇతర ఫీచర్లను యాక్సెస్ చేయడానికి మరియు ఉపయోగించడానికి మీరు మాతో నమోదు చేసుకోవచ్చు. మాతో నమోదు చేసుకోవడం ద్వారా, (ఎ) TBPతో ఒక ఒప్పందాన్ని రూపొందించడానికి మీకు తగిన అధికారం ఉందని మీరు అంగీకరిస్తున్నారు; (బి) మీ గురించి మీరు అందించే సమాచారం సత్యమైంది, ఖచ్చితమైనది, మరియు సంపూర్ణమైంది; మరియు (సి) వెబ్సైట్ యొక్క పరిమిత-యాక్సెస్ విభాగాలను ఉపయోగించడానికి మేము మీకు జారీ చేసే ఆధారాలను మాత్రమే ఉపయోగించుకోగలరు. ఏ కారణం చేతనైనా TBP గతంలో మీ వెబ్‌సైట్‌కు యాక్సెస్‌ను నిలిపివేస్తే, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేరు లేదా ఉపయోగించలేరు. |
మీరు మాతో నమోదు చేసుకున్నట్లయితే, మీ ఖాతా మరియు పాస్‌వర్డ్‌కు సంబంధించిన అన్ని విషయాలకు (వాటి గోప్యతను కాపాడుకోవడంతో సహా) మరియు మీ అనుమతితో లేదా అనుమతి లేకుండా ఇతరులు మీ ఖాతాను ఉపయోగించడం వంటి అంశాలకు మీరే బాధ్యులు. మీ ఖాతాను ఉపయోగించే ఇతరులు ఈ నిబంధనలకు లోబడి ఉన్నారని నిర్ధారించడానికి మీరు బాధ్యత వహిస్తారని అంగీకరిస్తున్నారు. మీ ఖాతా యొక్క అనధికార ఉపయోగం వల్ల కలిగే నష్టాలకు బైబిల్ ప్రాజెక్ట్ బాధ్యత వహించదు. |
ఏదైనా భద్రతా ఉల్లంఘన లేదా మీ ఖాతాను అనధికారికంగా ఉపయోగించడం గురించి మీరు మాకు తెలియజేసేటప్పుడు సబ్జెక్ట్ లైన్లో "అనధికార ఉపయోగం" అని వ్రాసి webmaster@jointhebibleproject.comకు ఇ-మెయిల్ పంపడం ద్వారా వెంటనే మాకు తెలియజేయాలి. మీరు మాకు తెలియజేసినప్పటికీ, మీ ఖాతాను ఉపయోగించడం వలన కలిగే ఏవైనా ఛార్జీలతో సహా, మీ యాక్సెస్ ఆధారాలను ఉపయోగించి జరిగే ఏవైనా చర్యలకు మీరు బాధ్యత వహిచవలసి ఉంటుంది. మా స్వంత అభీష్టానుసారం, వెబ్‌సైట్‌కు మీ యాక్సెస్ లేదా దానిలోని ఏ భాగాన్ని ఎప్పుడైనా ముందస్తు నోటీసు లేకుండా తొలగించే హక్కు మేము కలిగివున్నాము. |
మేధో సంపత్తి యాజమాన్యం |
కంటెంట్‌లోని కాపీరైట్లు, ట్రేడ్‌మార్క్‌లు మరియు ఇతర మేధో సంపత్తి హక్కులు మరియు అపరిమితమైన, సాఫ్ట్వేర్, టెక్స్ట్, గ్రాఫిక్స్, లోగోలు, బటన్ చిహ్నాలు, చిత్రాలు, ఆడియో క్లిప్‌లు, వీడియో క్లిప్‌లు, డేటా సంకలనాలు మరియు సేకరణతో సహా వెబ్సైట్లో ఉన్న ఇతర సమాచారం, వెబ్సైట్ యొక్క సంకలనం మరియు మొత్తం రూపకల్పన (సమిష్టిగా, "మేధో సంపత్తి"), TBP యాజమాన్యంలో లేదా లైసెన్స్ పొందినవి, మరియు మేధో సంపత్తికి సంబంధించి అన్ని హక్కులను మేము కలిగి ఉన్నాము. |
TBP ట్రేడ్‌మార్క్స్ |
నిర్దిష్ట కంటెంట్‌లోని కాపీరైట్లు కొన్ని నిర్దిష్ట ఉపయోగాల కొరకు ఈ నిబంధనల క్రింద లైసెన్స్ పొందినప్పటికీ, మీరు ఈ నిబంధనల ద్వారా మంజూరు చేయబడిన ట్రేడ్‌మార్క్ లేదా సర్వీస్ మార్క్ లైసెన్స్ కలిగివుండలేదు. అనగా U.S. చట్టం ప్రకారం రెఫరెన్షియల్ ఫెయిర్ వాడకానికి మీరు మా పేరు, లోగో లేదా మరే ఇతర TBP ఐడెంటిఫయర్‌ను ఉపయోగించరాదని దీని అర్థం. TBP మరియు మా కంటెంట్ వినియోగదారుల మధ్య ఉన్న సంబంధం గురించి ఎవరూ గందరగోళం చెందనవసరం లేదు. ఉదాహరణకు, ఈ నిబంధనల ప్రకారం కంటెంట్‌ను మాత్రమే ఉపయోగిస్తున్న వ్యక్తిని TBP ఆమోదిస్తుంది లేదా స్పాన్సర్ చేస్తుందని నమ్ముతారు, కాని ప్రత్యేక ఒప్పందం ప్రకారం మాత్రం కాదు. మీరు మా ట్రేడ్‌మార్క్‌లను రెఫరెన్షియల్ ఫెయిర్ వాడకానికి మించి ఉపయోగించాలనుకుంటే, దయచేసి ప్రత్యేక వినియోగ లైసెన్స్‌ను అభ్యర్థించడానికి మమ్మల్ని సంప్రదించండి. ఇటువంటి లైసెన్సులు సాధారణం కాదు, కానీ ప్రత్యేక పరిస్థితులలో మంజూరు చేయబడతాయి. మా గుర్తింపుకలిగిన దానిని దేనినైనా ఉపయోగించుకునేందుకు అవసరమైన లైసెన్స్, మా అధీకృత అధికారి ఒకరు సంతకం చేసిన వ్రాతపూర్వక లైసెన్స్ ఒప్పందంతో మాత్రమే మంజూరు చేయబడవచ్చు. ఏ ఇతర హక్కులు ఇవ్వడానికి లేదా మా గుర్తింపు వాడకానికి అధికారం ఇవ్వడానికి మరే వ్యక్తి లేదా ఏజెంట్‌కు అధికారం లేదు మరియు అలాంటి ప్రయత్నం చేసిన గ్రాంట్ లేదా సంబంధిత వాగ్దానం లేదా మార్గదర్శకత్వం చెల్లదు. |
వెబ్సైట్ మరియు విషయం యొక్క మీ వినియోగం |
వెబ్సైట్ యొక్క వినియోగదారునిగా, మీకు వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడానికి, వెబ్సైట్లో ఉన్న సమాచారాన్ని వీక్షించడానికి మరియు ఈ నిబంధనలలో వివరించిన విధంగా వెబ్‌సైట్‌తో అనుసంధానించబడడానికి రద్దు చేయగల, బదిలీ చేయలేని, ప్రత్యేక లైసెన్స్ ఉంది. ఇన్పుట్లు అవసరమయ్యే ఏదైనా అనుసంధానించబడిన భాగాలతో సహా వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు ప్రాతినిధ్యం వహిస్తారు మరియు (ఎ) మీరు వెబ్‌సైట్‌కు సమర్పించే ఏ సమాచారమైనా నిజాయితీగా మరియు ఖచ్చితమైనదిగా ఉంటుంది; (బి) మీరు ఆ సమాచారం యొక్క ఖచ్చితత్వాన్ని కొనసాగిస్తారు; మరియు (సి) మీరు వెబ్‌సైట్‌ను ఉపయోగించడమనేది,వర్తించేచట్టం, నియమం లేదా నియంత్రణను ఉల్లంఘించదు. మీరు మాకు అందించే ఏదైనా సమాచారం మా గోప్యతా నోటీసుకు లోబడి ఉంటుంది. |
మీరు వెబ్‌సైట్‌ను ఏదైనా వాణిజ్య ప్రయోజనాల కొరకు లేదా చట్టవిరుద్ధమైన లేదా తప్పుడు ప్రయోజనాల కొరకు ఉపయోగించ కూడదు. ఈ నిబంధనల ద్వారా స్పష్టంగా అధికారం కలిగి ఉండడం మినహా వెబ్‌సైట్‌ను ఉపయోగించడం, అద్దెకు ఇవ్వడం, తిరిగి ప్రసారం చేయడం, నకిలీ సృష్టించడం, వెల్లడి చేయడం, ప్రచురించడం, అమ్మడం, కేటాయించడం, లీజు, ఉపలైసెన్స్, మార్కెట్ లేదా బదిలీ చేయడం లేదా దానిలోని ఏదైనా భాగం (కంటెంట్‌తో సహా) చేయకూడదని మీరు అంగీకరిస్తున్నారు. వెబ్సైట్ లేదా వెబ్‌సైట్‌లోని ఏదైనా భాగాన్ని కాపీ, రివర్స్ ఇంజనీర్, అనువాదం, పోర్ట్, సవరించడం లేదా ఉత్పన్న రచనలు చేయకూడదని మీరు అంగీకరిస్తున్నారు. వెబ్‌సైట్‌ను ట్యాంపర్ చేయడం, వెబ్సైట్లో మోసపూరిత కార్యకలాపాలు నిర్వహించడం మరియు ఇతర అన్నిరకాల చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి మరియు దుర్వినియోగదారుని చట్టపరమైన చర్యలకు గురిచేయవచ్చు. |
వీడియో కంటెంట్. మా నుండి డౌన్లోడ్ చేయడానికి మా కొన్ని వీడియోలు www.bibleproject.com లేదా YouTubeపై ఛానెల్‌లు https://www.youtube.com/user/jointhebibleproject)లేదా Vimeo https://vimeo.com/channels/1241213) లేదా భవిష్యత్తులో మేము సృష్టించే ఇతర ఛానెల్‌లు (సమిష్టిగా, "వీడియో కంటెంట్") పై డౌన్లోడ్ చేసుకొనేందుకు వీలుగా కొన్ని నిర్ధారిత వీడియోలు లభ్యమవుతాయి. మా వీడియో కంటెంట్‌ను తొలగించమని మేము మీకు సూచించేంత వరకు మరియు మీరు నిబంధనలను ఖచ్చితంగా పాటించేంతవరకు, ప్రత్యేకించి క్రింద తెలిపిన ఆవశ్యకతలను మీరు పూర్తి చేసేంతవరకు, ఏదైనా స్ట్రీమ్‌లను మీ స్వంత వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్లోకి ఎంబెడ్ చేసుకోవడానికి మీకు అనుమతి ఉంటుంది. |
|
|
|
|
|
|
పోస్టర్స్. మా www.bibleproject.com (సమిష్టిగా "పోస్టర్లు") నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి కొన్ని నిర్ధారిత పోస్టి అందుబాటులో ఉన్నాయి. మేము ఈ అనుమతిని ఉపసంహరించుకునేంత వరకు మా పోస్టర్లలో దేనినైనా డిజిటల్‌గా లేదా వాస్తవ మాధ్యమంలో డౌన్లోడ్ చేసుకోవడానికి, పునరుత్పత్తి చేయడానికి మరియు ప్రదర్శించడానికి మీకు అనుమతి ఉంది, కానీ ఈ అనుమతి మీరు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించినంత వరకు ముఖ్యంగా ఈ క్రింది ఆవశ్యకతలను పాటించినంత వరకు మాత్రమే ఉంటుంది: |
|
|
|
|
మేము ఈ అనుమతిని ఉపసంహరించుకున్న సందర్భంలో, మీరు పోస్టర్ల యొక్క అన్ని డిజిటల్ డిస్ప్లేలను తొలగించాలి మరియు వాస్తవ మీడియాలో తిరిగి ఉత్పత్తి చేయబడిన పోస్టర్ల పంపిణీని నిలిపివేయాలి. |
ఇతర దృశ్యాత్మక కంటెంట్ మా నోట్స్, స్క్రిప్టులు మరియు పోస్టర్లు కాకుండా స్థిర విజువల్ కంటెంట్ (సమిష్టిగా, "ఇతర విజువల్ కంటెంట్")మా నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా www.bibleproject.com లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించినంత వరకు మరియు ముఖ్యంగా కింది ఆవశ్యకతలను పూర్తిచేసినంతవరకు, మరియు ఈ అనుమతిని మేము ఉపసంహరించుకునే వరకు, మా ఇతర విజువల్ కంటెంట్‌ను డిజిటల్‌గా వాస్తవ మీడియాలో ఒకేసారి ప్రదర్శించడానికి లేదా స్పష్టమైన మాధ్యమంలో డౌన్లోడ్ చేయడానికి, తిరిగి ఉత్పత్తి చేయడానికి మరియు ప్రదర్శించడానికి మాత్రమే మీకు అనుమతి ఉంది: |
|
|
|
|
మేము ఈ అనుమతిని ఉపసంహరించుకున్న సందర్భంలో, మీరు ఇతర విజువల్ కంటెంట్ యొక్క అన్నిరకాల డిజిటల్ డిస్ప్లేలను తొలగించాలి మరియు వాస్తవ మీడియాలో తిరిగి ఉత్పత్తి చేయబడిన ఇతర విజువల్ కంటెంట్ పంపిణీని నిలిపివేయాలి. |
పాడ్‌కాస్ట్‌లు. మా నుండి ప్రసారం చేయడానికి మా పాడ్‌కాస్ట్‌లు మరియు ఇతర ఆడియో కంటెంట్లు కొన్ని www.bibleproject.com సైట్లోఅందుబాటులో ఉన్నాయి మరియు అనేక ఇతర అధీకృత ఆడియో స్ట్రీమింగ్ సేవలు (సమిష్టిగా, "ఆడియో కంటెంట్") కూడా అందుబాటులో ఉంటాయి. మా సైట్ లేదా Apple Podcasts, Google Podcasts, మరియు Spotify వంటి అధీకృత సేవల నుండి మా ఆడియో కంటెంట్‌ను ప్లే చేయడానికి మీకు అనుమతి ఉన్నప్పటికీ (మీరు ఆ అధీకృత సేవల యొక్క ఏవైనా అవసరాలకు అనుగుణంగా ఉన్నంత వరకు), ఈ నిబంధనల ప్రకారం మా ఆడియో కంటెంట్‌ను రికార్డ్ చేయడానికి, తిరిగి ఉత్పత్తి చేయడానికి, ప్రసారం చేయడానికి లేదా మరి దేనికైనా ఉపయోగించుకోవడానికి అనుమతి లేదు. పైన అనుమతించబడినది కాకుండా మా ఆడియో కంటెంట్ నుండి మీరు దేనినైనా ఉపయోగించాలనుకుంటే, ప్రత్యేక వినియోగ లైసెన్స్‌ను పొందడానికి దయచేసి మమ్మల్ని సంప్రదించండి. |
వెబ్సైట్ మరియు విషయం యొక్క మీ వినియోగంపై పరిమితులు |
వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం వల్ల ఈ నిబంధనల ద్వారా ప్రత్యేకంగా అధికారం పొందడం మినహా మరే విధంగా, ఏ కంటెంట్‌ను ఉపయోగించడానికి మీకు అధికారం లేదు. పైన పేర్కొన్న వాటిని పరిమితం చేయకుండా, ఈ నిబంధనల ద్వారా ప్రత్యేకంగా అనుమతించకపోయినట్లయితే, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకపోవచ్చు: |
|
|
|
|
|
|
|
మీరు ఈ నిబంధనలలోని ఏదైనా నిబంధనను ఉల్లంఘించినట్లయితే, ఈ నిబంధనలలో వివరించిన అనుమతులు వాటంతట అవే ముగుసిపోతాయి. ఈ నిబంధనల ద్వారా స్పష్టంగా అనుమతించబడని కంటెంట్ యొక్క ఏదైనా ఉపయోగం కాపీరైట్ లేదా ట్రేడ్‌మార్క్ చట్టాలను ఉల్లంఘించడం మరియు బైబిల్ ప్రాజెక్ట్ యొక్క ముందస్తు వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఉపయోగించడం ఖచ్చితంగా నిషేధించబడింది. |
యూజర్ ఉత్పత్తి చేసిన మెటీరియల్ |
యూజర్ ఉత్పత్తి చేసిన మెటీరియల్‌ను అంగీకరించడానికి TBP అనుకొన్నట్లయితే, వెబ్సైట్లో ("యూజర్ జనరేటెడ్ మెటీరియల్") యాక్సెస్ చేయగల మరియు వ్యాఖ్యానించగల, ఫోటోలను లేదా ఇతర పదార్థాలను ప్రచురించడానికి, చేయడానికి, సమర్పించడానికి లేదా పోస్ట్ చేయడానికి మీకు అవకాశం ఉండవచ్చు మరియు దానిని ప్రజలు చూడగలుగుతారు. మీరు పోస్ట్ చేసిన ఏదైనా యూజర్ జనరేటెడ్ మెటీరియల్‌కు సంబంధించి, మీరు (i) మీరు కంటెంట్‌పై హక్కులను సృష్టించారు మరియు స్వంతం చేసుకున్నారు లేదా అలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి మీకు యజమానిచే వ్యక్తీకరించబడిన అనుమతి ఉంది మరియు (ii) కంటెంట్ ఏ ఇతర వ్యక్తికి హక్కులను ఉల్లంఘించదు లేదా సంస్థ యొక్క హక్కులను హరించదు (పరిమితి లేకుండా, కాపీరైట్లు, ట్రేడ్‌మార్క్‌లు లేదా గోప్యతా హక్కులతో సహా) లేదా వర్తించే ఏదైనా చట్టాలు, నియమాలు లేదా నిబంధనలు, ఈ ఉపయోగ నిబంధనలు లేదా పోస్ట్ చేసిన మా ఇతర విధానాలను ఉల్లంఘిస్తాయి. అదనంగా, యూజర్ ఉత్పత్తి చేసిన మెటీరియల్ ఖచ్చితంగా ఇది కలిగివుండరాదు: |
|
|
|
|
|
|
|
|
|
|
|
దయచేసి మీరు వెబ్సైట్లో పోస్ట్ చేసే సమాచారాన్ని మరియు మీరు ఇతర వినియోగదారులకు ఇచ్చే సమాచారాన్ని జాగ్రత్తగా ఎంచుకోండి. మీ పూర్తి పేరు, టెలిఫోన్ నంబర్, వీధి చిరునామా, ఇ-మెయిల్ చిరునామా లేదా మిమ్మల్ని గుర్తించే లేదా అపరిచితులు మిమ్మల్ని కనుగొనడానికి లేదా మీ గుర్తింపును దొంగిలించడానికి అనుమతించే ఇతర సమాచారాన్ని బహిరంగంగా పోస్ట్ చేయవద్దని TBP మిమ్మల్ని కోరుతుంది. మీ యూజర్ ఉత్పత్తి చేసిన మెటీరియల్ మరియు దానిని ఆన్లైన్లో పోస్ట్ చేయడం వల్ల కలిగే పరిణామాలకు మీరు మాత్రమే బాధ్యత వహిస్తారు. వెబ్సైట్ ద్వారా మీరు సంప్రదించిన ఇతర వినియోగదారులతో వ్యవహరించినప్పుడు సంభవించే అన్ని నష్టాలకు మీరే బాధ్యత హిస్తారు, మరియు చట్టం అనుమతించే మేరకు, వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఏదైనా యూజర్ జనరేటెడ్ మెటీరియల్‌కు సంబంధించిన ఏవైనా దావాలు లేదా ఇతర వినియోగదారుల ప్రవర్తనకు సంబంధించిన దావాల బాధ్యతల నుండి మీరు మాకు సంబంధం లేకుండా చేస్తారు. |
యూజర్ ఉత్పత్తి చేసిన మెటీరియల్‌ను ఎప్పుడైనా మరియు ఏ కారణం చేతనైనా నోటీసు లేకుండా పర్యవేక్షించడం, సమీక్షించడం, తీవ్రంగా పరీక్షించడం, పోస్ట్ చేయడం, తొలగించడం, తిరస్కరించడం, సవరించడం లేదా భద్రపరచడం వంటి హక్కు మేము కలిగి ఉంటాము. మీకు మరియు ఇతర వినియోగదారుల మధ్య వివాదాలకు సంబంధించి ఏదైనా చర్య తీసుకునే హక్కు కూడా మేము కలిగి ఉంటాము మరియు మీ పరస్పర చర్యలకు లేదా ఇతర వినియోగదారులతో ఏదైనా వివాదాలకు లేదా ఏదైనా వినియోగదారుని చర్యకు లేదా నిష్క్రియాత్మకతకు ఎటువంటి బాధ్యత వహించము. వెబ్సైట్లో మీ ప్రవర్తన మరియు ఇతర వినియోగదారులతో మీ పరస్పర చర్యలకు మీరు మాత్రమే బాధ్యత వహిస్తారు. |
యూజర్ ఉత్పత్తి చేసే మెటీరియల్ ఈ నిబంధనలను ఉల్లంఘించవచ్చు లేదా అభ్యంతరకరంగా ఉంటుందని మా నమ్మకంతో సహా, మా స్వంత అభీష్టానుసారం ఏ కారణం చేతనైనా నోటీసు లేకుండా యూజర్ ఉత్పత్తి చేసిన మెటీరియల్‌ను మేము తిరస్కరించవచ్చు, మార్చవచ్చు లేదా తొలగించవచ్చు. మేము ఏ యూజర్ ఉత్పత్తి చేసే మెటీరియల్‌కు ప్రచారం కల్పించము మరియు పోస్ట్ చేసిన యూజర్ ఉత్పత్తి చేసిన మెటీరియల్ మా అభిప్రాయాలను, లేదా సలహాలను ప్రతిబింబించదు. మేము లేదా మీరు లేదా మరే ఇతర యూజర్ లేదా తృతీయ పక్ష పోస్ట్‌లు లేదా వెబ్సైట్ ద్వారా లేదా పంపిన ఏ యూజర్ ఉత్పత్తి చేసిన మెటీరియల్‌కు ఎటువంటి బాధ్యత వహించము, ఏదైనా వినియోగదారు లేదా తృతీయ పక్షం ద్వారా లేదా ప్రసారాలు, కమ్యూనికేషన్లు లేదా అందించిన కంటెంట్‌కు సంబంధించి ఏదైనా చర్యకు లేదా నిష్క్రియాత్మకతకు మేము ఎటువంటి బాధ్యత వహించము. |
వెబ్సైట్ రక్షణ |
వెబ్సైట్ యొక్క భద్రతా లక్షణాలను ఉల్లంఘించడం లేదా ఉల్లంఘించడానికి ప్రయత్నించడం వంటి వాటికి సంబంధించి, దిగువ వాటి నుండి మీరు ఖచ్చితంగా నిషేధించబడ్డారు: |
|
|
|
|
వెబ్సైట్ సరిగ్గా పని చేయడంలో లేదా వెబ్సైట్లో నిర్వహించే ఏదైనా కార్యాచరణలో జోక్యం చేసుకోవడానికి లేదా ఏ పరికరం, సాఫ్ట్వేర్ లేదా ప్రక్రియను ఉపయోగించకూడదని మీరు దీని ద్వారా అంగీకరిస్తున్నారు. సెర్చ్ ఇంజన్ మరియు సెర్చ్ ఏజెంట్లు కాకుండా వెబ్‌సైట్‌ను నావిగేట్ చేయడానికి లేదా శోధించడానికి ఏదైనా ఇంజిన్, సాఫ్ట్వేర్, సాధనం, ఏజెంట్ లేదా ఇతర పరికరం లేదా యంత్రాంగాన్ని (బ్రౌజర్లు, స్పైడర్స్, రోబోలు, అవతారాలు లేదా తెలివైన ఏజెంట్లతో సహా) ఉపయోగించకూడదని మీరు అంగీకరిస్తున్నారు. మేము ఈ వెబ్సైట్లో మరియు సాధారణంగా అందుబాటులో ఉన్న Chrome, Firefox, Safari లేదా Edge వంటి తృతీయ పక్ష వెబ్ బ్రౌజర్లను కాకుండా అందుబాటులో ఉంచుతాము. |
మీరు మా సిస్టమ్ లేదా నెట్వర్క్ భద్రతను ఉల్లంఘించినట్లయితే, మీరు సివిల్ లేదా క్రిమినల్ చర్యలను ఎదుర్కోవచ్చు. అటువంటి ఉల్లంఘనలకు సంబంధించిన సంఘటనలను మేము పరిశోధిస్తాము. అటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన వినియోగదారులను విచారించడంలో మేము చట్టబద్దమైన అధికారుల తీసుకొను చర్యలలో పాల్గొనవచ్చు లేదా సహకరించవచ్చు. |
వెబ్సైట్ వినియోగం మార్పు, తాత్కాలిక నిలుపుదల లేదా ముగింపు. |
వెబ్సైట్ యొక్క ఏదైనా అంశాన్ని ఎప్పుడైనా మరియు ఎప్పటికప్పుడు, మా స్వంత అభీష్టానుసారం మరియు నోటీసు లేదా బాధ్యత లేకుండా, కొన్ని లక్షణాలను జోడించడం లేదా తొలగించడం ద్వారా లేదా వెబ్‌సైట్‌ను పూర్తిగా నిలిపివేయడానికి, మార్చడానికి, తాత్కాలికంగా నిలిపివేయడానికి లేదా పూర్తిగా నిలిపివేయడానికి హక్కు కలిగి ఉంటాము. ఎప్పటికప్పుడు, మేము కొన్ని లేదా అన్ని వెబ్సైట్ల యాక్సెస్ సౌకర్యాన్ని పరిమితం చేయవచ్చు. మా స్వంత అభీష్టానుసారం ఏ కారణం చేతనైనా లేదా ఎటువంటి కారణం లేకుండా కూడా, నోటీసు లేదా సమాచారం లేకుండా, మీ ఖాతాను స్తంభింపజేయడానికి లేదా నిలిపివేయడానికి లేదా వెబ్సైట్ యొక్క మీ వినియోగాన్ని లేదా యాక్సెస్‌ను పరిమితం చేసే హక్కును కూడా మేము కలిగి ఉన్నాము. దీని ప్రకారం, ఏ కారణం చేతనైనా, మరియు నోటీసు లేకుండా, వెబ్‌సైట్‌లోని అన్ని లేదా ఏదైనా భాగం మీకు ఎప్పుడైనా మరియు ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండకపోవచ్చు. |
మేము వెబ్సైట్ యొక్క ఏదైనా అంశాన్ని నిలిపివేస్తే లేదా మీ ఖాతాను స్తంభింపచేసినట్లయితే, మీకు ఏదైనా సమాచారం లేదా కంటెంట్‌ను అందించే బాధ్యత మాపై ఉండదు. మేము మీ ఇతర ప్రాధాన్యతలను మరియు ఆసక్తులను మీ ఖాతా నుండి లేదా వాటికి సంబంధించి భద్రపరచబడిన వాటి నుండి మేము తొలగించవచ్చు. ఆ సమాచారానికి మీరు సూచించే విలువతో సంబంధం లేకుండా మేము తొలగించే ఏ సమాచారానికి సంబంధించి మీకు ఎటువంటి ఆధారం లేదు మరియు మా సర్వర్లలో నిల్వ చేయబడిన మీ సమాచారానికి మీరు ఆపాదించే ఏదైనా విలువను మేము స్పష్టంగా నిరాకరించవచ్చు. |
ప్రైవసీ మరియు కమ్యూనికేషన్స్ |
గోప్యతా నోటీసు. మీరు మా గోప్యతా నోటీసును చదివి అర్థం చేసుకున్నారని మీరు అంగీకరించారు. మీరు మా గోప్యతా నోటీసును ఎప్పుడైనా సమీక్షించవచ్చు. |
ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌కు సమ్మతి. మా స్వంత అభీష్టానుసారం మాచే నిర్ణయించబడిన ఇ-మెయిల్, వెబ్సైట్లో పోస్ట్ చేసిన నోటీసులు లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా మా నుండి లభించే కమ్యూనికేషన్లను స్వీకరించడానికి మీరు అంగీకరిస్తున్నారు. మీకు ఏదైనా నోటీసు, బహిర్గతం, ఒప్పందం లేదా ఇతర సంభాషణలను వ్రాతపూర్వకంగా పంపించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు అటువంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా సంతృప్తికరంగా ఉంటుందని మీరు అంగీకరిస్తున్నారు. మీరు లేదా మీ నెట్వర్క్ ప్రొవైడర్ అటువంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు వర్తింపజేసే ఏదైనా ఆటోమేటిక్ ఫిల్టరింగ్కు మేము బాధ్యత వహించము. |
తృతీయ పక్షాల ద్వారా మీ సమాచారానికి యాక్సెస్ మీరు మా ఉత్పత్తులు మరియు సేవల కొరకు సైనప్ చేసినప్పుడు లేదా ఉపయోగించినప్పుడు, మీ గురించి సేకరించిన సమాచారాన్ని తృతీయ పక్షాలు యాక్సెస్ చేయడానికి మీరు మాకు అనుమతి ఇవ్వవచ్చు. ఉదాహరణకు, మీరు మీ Facebook ఖాతాల నుండి సమాచారాన్ని (మీ పూర్తి పేరు మరియు ఇమెయిల్ వంటివి) పొందటానికి మాకు అనుమతిచ్చేలా ఆ ఖాతాను లింక్ చేయవచ్చు. ఆ సేవల నుండి మాకు లభించే సమాచారం తరచుగా మీ సెట్టింగులు లేదా వాటి గోప్యతా నోటీసులపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి మీ సెట్టింగులను తనిఖీ చేసుకొంటూ ఉండండి. |
పరిపాలనా చట్టం |
వెబ్‌సైట్‌ను, బైబిల్ప్రాజెక్ట్, యునైటెడ్ స్టేట్స్ లోని దాని కార్యాలయాల నుండి నియంత్రిస్తుంది మరియు నిర్వహిస్తుంది. వెబ్సైట్ మరియు ఇక్కడ ఉన్న సామాగ్రుల వాడకంతో సహా ఇప్పటినుండి యునైటెడ్ స్టేట్స్ మరియు ఒరెగాన్ రాష్ట్రాల చట్టాలచే నిర్వహించబడతాయి. మీరు మరొక ప్రదేశం నుండి వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయాలని ఎంచుకుంటే, మీరు మీ స్వంత చొరవతో అలా చేస్తారు మరియు వర్తించే స్థానిక చట్టాలకు లోబడి ఉంటారు. |
వారంటీ డిస్‌క్లెయిమర్ |
బైబిల్ ప్రాజెక్ట్ దాని వెబ్‌సైట్‌ను మరియు దాని కంటెంట్‌ను "ఉన్నది ఉన్నట్టుగా" అందిస్తుంది మరియు ఇది ఏ రకమైన ఆధారాలు లేదా వారెంటీలపై ఆధారపడదు, మరొకటి వ్యక్తీకరించడం లేదా పరిమితి లేకుండా అమలు చేయడం, లేదా అంతకు మించి, సైట్లకు లేదా వారి నిర్వహణకు లేదా కంటెంట్‌కు ఉద్దేశించి, లేదా తెలియని సమాచారం అందివ్వదు. TBP ఖచ్చితమైన, సంపూర్ణమైన మరియు ప్రస్తుతమున్న విషయాన్ని నమ్మినప్పటికీ, TBP సైట్లలోని సమాచారం ఖచ్చితమైనది, సంపూర్ణమైనది లేదా ప్రస్తుతమున్నది అని సూచించదు లేదా హామీ ఇవ్వదు. TBP మా సైట్ల లభ్యతకు హామీ ఇవ్వదు మరియు మా సైట్ల యొక్క మీ ఉపయోగం నుండి మేము ఏ ప్రత్యేకమైన ఫలితాలను ప్రకటించలేము. మీరు మీ స్వంత రిస్క్‌తో మా సైట్లను ఉపయోగిస్తున్నారు. |
మా సైట్లో లేదా దాని ద్వారా పోస్ట్ చేయబడిన ఏదైనా కంటెంట్ యొక్క ఖచ్చితత్వం మరియు విశ్వసనీయతకు సంబంధించి, పరిమితి లేకుండా మా సైట్‌తో అనుబంధించబడిన లేదా ఉపయోగించిన ఏదైనా పరికరాలు లేదా ప్రోగ్రామింగ్ ద్వారా, మా ఏజెంట్లు లేదా ప్రతినిధుల ద్వారా, వినియోగదారుల ద్వారా మా సైట్లో వ్యక్తీకరించబడిన లేదా సూచించిన ఏదైనా కంటెంట్‌కు మేము బాధ్యత వహించము. మా సైట్లు ఇతర వెబ్సైట్లకు లింక్‌లను కలిగి ఉండవచ్చు మరియు ఆ ఇతర వెబ్సైట్లలో వ్యక్తీకరించబడిన కంటెంట్, ఖచ్చితత్వం లేదా అభిప్రాయాలకు మేము బాధ్యత వహించము మరియు ఖచ్చితత్వం లేదా సంపూర్ణత్వానికై మేము ఆ వెబ్సైట్లను పరిశోధించము, నియంత్రించము లేదా తనిఖీ చేయము. మా సైట్లో ఏదైనా లింక్ చేయబడిన వెబ్‌సైట్‌ను చేర్చడం అనేది లింక్ చేసిన వెబ్‌సైట్‌కు మా ఆమోదం లేదా అంగీకారాన్ని సూచించదు. మీరు ఈ తృతీయ పక్ష సైట్లను యాక్సెస్ చేసినప్పుడు, మీరు మీ స్వంత రిస్క్‌తో అలా చేస్తున్నారు. మా సైట్లో లేదా దాని ద్వారా పోస్ట్ చేయబడిన తృతీయ పక్ష ప్రకటనలు లేదా తృతీయ పక్ష అనువర్తనాలకు మేము ఎటువంటి బాధ్యత తీసుకోము, లేదా అలాంటి ప్రకటనదారులు అందించే వస్తువులు లేదా సేవలకు మేము ఎటువంటి బాధ్యత తీసుకోము. మా సైట్‌లోని ఏ యూజర్ అయినా కంటెంట్‌ను పోస్ట్ చేయడంతో సహా మా సైట్ల యొక్క ఏదైనా వినియోగదారు యొక్క ఏదైనా చర్య లేదా తొలగింపుకు (ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ అయినా) మేము బాధ్యత వహించము. ఏదైనా లోపం, మినహాయింపు, అంతరాయం, తొలగింపు, దోషం, ఆపరేషన్ లేదా ప్రసారంలో ఆలస్యం, కమ్యూనికేషన్ లైన్ వైఫల్యం, చౌర్యం లేదా విధ్వంసం లేదా ఏదైనా వినియోగదారు కమ్యూనికేషన్‌కు అనధికార యాక్సెస్ లేదా మార్పుకు మేము ఎటువంటి బాధ్యత వహించము. మా సైట్లకు సంబంధించిన నష్టం, దెబ్బతినడం లేదా పనిచేయకపోవడం లేదా మీ ఉపయోగం (కమ్యూనికేషన్ నెట్వర్క్ లేదా లైన్లు, కంప్యూటర్ ఆన్లైన్ సిస్టమ్స్, వైరస్లు లేదా ఇతర మాల్వేర్, సర్వర్లు లేదా ప్రొవైడర్లు, కంప్యూటర్ పరికరాలు , సాఫ్ట్వేర్, సాంకేతిక సమస్యలు లేదా ఇంటర్నెట్లో మరియు / లేదా మా సైట్లలో ట్రాఫిక్ రద్దీ కారణంగా ఏదైనా ఇమెయిల్ వైఫల్యం)వంటి ఏవైనా సమస్యలకు మేము బాధ్యత వహించము. మా సైట్ల వాడకం వల్ల, వినియోగదారుల ప్రవర్తన (ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ అయినా), లేదా ఇతరత్రా వ్యక్తిగత గాయం లేదా మరణంతో సహా ఏదైనా నష్టానికి మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించము. మీరు మా సైట్లను ఉపయోగించడం (లేదా ఉపయోగించలేకపోవడం) వల్ల కలిగే మీ కంప్యూటర్, సాఫ్ట్వేర్, మోడెమ్, టెలిఫోన్ లేదా ఇతర ఆస్తికి ఏదైనా నష్టం సంభవిస్తే మేము బాధ్యత వహించము. మీరు మా సైట్ల ద్వారా సమాచారాన్ని యాక్సెస్ చేయలేకపోతే మేము దానికి బాధ్యత వహించము. కొన్ని వారెంటీలు మరియు / లేదా బాధ్యతల మినహాయింపు లేదా పరిమితిని కొన్ని రాష్ట్రాలు అనుమతించవు, కాబట్టి పైన పేర్కొన్న కొన్ని పరిమితులు లేదా మినహాయింపులు మీకు వర్తించకపోవచ్చు. |
బాధ్యత యొక్క పరిమితి |
బైబిల్ప్రాజెక్ట్ లేదా దాని ఉద్యోగులు, డైరెక్టర్లు, అధికారులు, ఏజెంట్లు, సరఫరాదారులు లేదా తృతీయ పక్ష సర్వీసు ప్రొవైడర్లు లేదా ఇతర వ్యక్తులతో లేదా సంబంధం ఉన్న ఇతర వ్యక్తి లేదా మా సైట్ల వినియోగ పరితిమిని దాటడం, లేదా కంటెంట్, పరిమితి లేని కంటెంట్ తో సహా, ప్రత్యేకమైన, పరోక్ష, విలక్షణమైన ఏ సంఘటనలో, లేదా సంభావ్య నష్టాలు లేదా ఏదైనా నష్టాలు, వీటికి పరిమితం కాక,ఉపయోగం కోల్పోవడం,డేటా, లాభాలు లేదా మంచి పేరు,వ్యాపార అంతరాయం, లేదా కంప్యూటర్ వైఫల్యం లేదా పనిచేయకపోవడం,ఏదైనా చర్య యొక్క రూపం లేకుండా,కాంటాక్ట్, ఖచ్చిత బాధ్యత, నిర్లక్ష్యం, లేదా ఇతర కఠినమైన చర్యలకు పరిమితం కాకుండా, ఉపయోగం, అనుసంధానం,ఉపయోగించలేక పోవడం, కాపీ చేయడం లేదా కంటెంట్ ప్రదర్శనలకు బాధ్యత వహించరు. ఈ పరిమితి, ఏవిధమైన పరిమితి లేకుండా, కాంట్రాక్ట్ యొక్క ఉల్లంఘన, వారెంటీ, డీఫమేషన్, ఖచ్చిత బాధ్యత, దుర్వినియోగం, ఉత్పత్తుల బాధ్యత, చట్టాల ఉల్లంఘన, (నిబంధనలతో సహా ), నిర్లక్ష్యం మరియు ఇతర టార్ట్స్,తృతీయ పక్ష క్లెయిమ్ వంటి అన్ని క్లెయిమ్‌లకు వర్తిస్తుంది |
పైన పేర్కొన్న నిబంధనలను పరిమితం చేయకుండా, గత 12 నెలల్లో మీరు బైబిల్ప్రాజెక్ట్ కు చెల్లించిన మొత్తానికి గరిష్టంగా పరిమితం చేయబడుతుంది. |
పరిహారం |
మా సబ్సిడియరీలు మరియు మా అనుబంధ సంస్థలు, మరియు వాటి బాధ్యతాయుతమైన సభ్యులు, డైరెక్టర్లు, అధికారులు, ఏజెంట్లు, భాగస్వాములు మరియు ఉద్యోగులు, ప్రమాదరహిత ఏదైనా నష్టం, బాధ్యత, ధర, వ్యయం, క్లెయిమ్, నష్టాలు లేదా డిమాండ్ పరిమితి లేకుండా, అటార్నీ ఫీజులు,బకాయి లేదా బయటపడడం (I) మా నిబంధనలను ఉల్లంఘిస్తూ మా సైట్ల ఉపయోగం , (II) మా నిబంధనల ఉల్లంఘన లేదా (III) మీ నిబంధనల యొక్క ఏవైనా ఉల్లంఘనలు మరియు వారంటీలు మా నిబంధనలలో సెట్ చేయబడడానికి మీరు ధ్రువీకరిస్తూ అంగీకరిస్తున్నారు మరియు మమ్ములను అనుసరిస్తున్నారు. |
వినియోగ నిబంధనలకు సవరణలు |
ముందస్తు నోటీసు లేకుండా ఈ పోస్టింగ్‌ను అప్డేట్ చేయడం ద్వారా ఈ నిబంధనలను సవరించే హక్కు బైబిల్ప్రాజెక్ట్ కలిగిఉంది. మీకు ముందస్తు నోటీసు లేకుండా ఏ కారణం చేతనైనా మేము ఈ ఉపయోగ నిబంధనలను ఎప్పుడైనా సవరించవచ్చు లేదా అప్డేట్ చేయబడిన మరియు ఈ ఉపయోగ నిబంధనలలో చేయబడిన ఏవైనా మార్పులు ఈ పేజీలో పోస్ట్ చేసిన వెంటనే ఇంతకుముందు ఉన్న ఉపయోగ నిబంధనలను అధిగమిస్తాయి మరియు భర్తీ చేస్తాయి. ఈ నిబంధనలలోని ఏ భాగమైనా అమలు చేయబడనదిగా గుర్తించినప్పటికీ, ఈ నిబంధనలలో మిగిలినవి పూర్తి శక్తితో మరియు ప్రభావంతో ఉంటాయి మరియు లేకపోతే అమలు చేయలేని భాగం చట్టం ద్వారా అనుమతించబడినంతవరకు అమలు చేయబడే విధంగా సవరించబడుతుంది. అటువంటి పునశ్చరణలకు కట్టుబడి ఉంటామని మీరు అంగీకరిస్తున్నారు. ప్రస్తుత ఉపయోగ నిబంధనలను నిర్ణయించడానికి ఈ పేజీని ఎప్పటికప్పుడు సందర్శించాలని మీకు సలహా ఇవ్వబడుతుంది. |
క్లాస్ యాక్షన్ మాఫీ |
ఏదైనా దావా, వివాదం లేదా వివాదానికి సంబంధించి బైబిల్ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏదైనా క్లాస్ యాక్షన్ వ్యాజ్యాన్ని ప్రారంభించడానికి లేదా పాల్గొనడానికి మీరు దీని ద్వారా హక్కును కోల్పోతారు మరియు, వర్తించే చోట, బైబిల్ప్రాజెక్ట్కు వ్యతిరేకంగా ఏదైనా క్లాస్ యాక్షన్లను నిలిపివేయడానికి మీరు అంగీకరిస్తున్నారు. |
మధ్యవర్తిత్వ ఒప్పందం |
గమనిక: ఈ మధ్యవర్తిత్వ ఒప్పందం యునైటెడ్ స్టేట్స్ లోని వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. |
న్యాయస్థానంలో లేదా న్యాయమూర్తికి ఎదుట వ్యాజ్యాలను దాఖలు చేయడానికి ఏ హక్కులను కలిగి లేదా లేదా క్లాస్ యాక్షన్‌లో పాల్గొనడానికి లేదా వ్యాజ్యాన్ని గౌరవించడానికి ప్రాతినిధ్యం వహించడానికి హక్కును ఇవ్వడం వంటి చర్యలను మీరు మరియు TBP అంగీకరిస్తున్నారు. మీరు కోర్టుకు వెళ్లాలనుకుంటే మీరు కలిగివున్న ఇతర హక్కులు అనగా కనుగొనడానికి యాక్సెస్, ఆర్బిట్రేషన్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు లేదా పరిమితం కావచ్చు కూడా. |
ఈ ఉపయోగ నిబంధనలు మరియు వాటి వ్యాఖ్యానం లేదా ఉల్లంఘన, రద్దు లేదా చెల్లుబాటు నుండి ఉత్పన్నమయ్యే లేదా వాటికి సంబంధించిన ఏదైనా వ్యాజ్యం లేదా వివాదం, ఈ ఉపయోగ నిబంధనల ఫలితంగా ఏర్పడే సంబంధాలు, చెల్లుబాటు గురించి వివాదాలతో సహా, ఈ మధ్యవర్తిత్వ నిబంధన యొక్క పరిధి లేదా అమలు సామర్థ్యం (సమిష్టిగా, "కవర్డ్ వివాదాలు") ప్రత్యేకంగా కోర్టులో కాకుండా కట్టుబడి ఉండేలా, వ్యక్తిగత మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడతాయి మరియు పోర్ట్ ల్యాండ్, ఒరెగాన్ లేదా పార్టీలకు పరస్పరం అంగీకరించే మరొక ప్రదేశంలో నిర్వహించబడతాయి. మధ్యవర్తిత్వాన్ని, అమెరికన్ ఆర్బిట్రేషన్ అసోసియేషన్ ("AAA"), దాని నియమాలు మరియు విధానాల ప్రకారం నిర్వహిస్తుంది. ఫెడరల్ ఆర్బిట్రేషన్ చట్టం ఈ మధ్యవర్తిత్వ ఒప్పందం యొక్క వివరణ మరియు అమలును నియంత్రిస్తుంది. ప్రత్యామ్నాయంగా,మీరు మీ వాదనలను చిన్న స్థాయి క్లెయిమ్ కోర్టులో పేర్కొనవచ్చు, మీ వాదనలు అర్హత కలిగి ఉంటే మరియు ఈ విషయం అటువంటి కోర్టులో ఉండి, ఒక వ్యక్తి (తరగతి కాని, ప్రతినిధి కాని) ప్రాతిపదికన మాత్రమే తదుపరి స్థాయికి చేరుతుంది. |
ఏదైనా మధ్యవర్తిత్వాన్ని ప్రారంభించడానికి ముందు, ప్రారంభించినప్పుడు పార్టీ, ఇతర పార్టీకి మధ్యవర్తిత్వం కొరకు దాఖలు చేయడానికి కనీసం 60 రోజుల ముందస్తు లిఖితపూర్వక నోటీసు ఇస్తుంది. మావద్ద ఉన్న ఫైల్లోని మీ ఇ-మెయిల్ చిరునామాకు TBP ఇ-మెయిల్ ద్వారా అలాంటి నోటీసును అందిస్తుంది మరియు మీరు అట్టి నోటీసును ఇ-మెయిల్ ద్వారా webmaster@jointhebibleproject.com కు తప్పక అందించాలి. అటువంటి 60-రోజుల నోటీసు వ్యవధిలో, వివాదాలను పరస్పర చర్చల ద్వారా స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఇరు పక్షాలు ప్రయత్నిస్తాయి. అటువంటి స్నేహపూర్వక పరిష్కారం మరియు నోటీసు వ్యవధి ముగియడంలో విఫలమైతే, ఏదైనా పార్టీ మధ్యవర్తిత్వాన్ని ప్రారంభించవచ్చు. |
చట్టం ప్రకారం, మధ్యవర్తి కోర్టులో లభించే ఏరకమైన ఉపశమనాన్నైనా మంజూరు చేసే అధికారం కలిగి ఉంటారు లేదా ఫలితంగా మధ్యవర్తుల నిర్ణయాలు తుది తీర్పులుగా ఉంటాయి మరియు ఇరుపార్టీలు వాటికి కట్టుబడి ఉండాలి. మధ్యవర్తి ఇచ్చిన తీర్పుపై ప్రత్యర్ధి అధికార పరిధిలోని ఏదైనా కోర్టులోనైనా సవాలు చేయవచ్చు. వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి బాధ్యత కలిగి ఉన్నప్పటికీ, ప్రతి పార్టీ సమర్థవంతమైన అధికార పరిధిలో ఏ కోర్టు నుండి అయినా ఎప్పుడైనా నిషేధ లేదా ఇతర సమానమైన ఉపశమనం పొందే హక్కు కలిగి ఉంటుంది.. మధ్యవర్తి వర్తించే చట్టం మరియు ఈ షరతుల ఉపయోగం మరియు వైఫల్య నిబంధనలను వర్తింపజేస్తారు మరియు ఆవిధంగా చేయడంలో వైఫల్యం చెందితే, అది మధ్యవర్తిత్వ అధికార మరియు న్యాయ సమీక్షకు కారణాలుగా పరిగణించబడతాయి. కవర్ చేయబడిన తరగతి వర్గం, ప్రతినిధి లేదా ప్రైవేట్ అటార్నీ చర్యను మధ్యవర్తిత్వం చేయడానికి TBPకి లేదా మీకు అర్హత లేదు మరియు తరగతి, ప్రతినిధి లేదా ప్రైవేట్ అటార్నీ జనరల్ ప్రాతిపదికన దీనిని కొనసాగించేందుకు మధ్యవర్తి (ల) కు అధికారం ఉండదు. ఈ విభాగంలో మధ్యవర్తిత్వం చేయడానికి ఒప్పందం యొక్క ఏదైనా నిబంధన చట్టవిరుద్ధం లేదా అమలు చేయలేనిది అనిపిస్తే,మిగిలిన మధ్యవర్తిత్వ నిబంధనలు పూర్తిగా చెల్లుబాటు అయ్యేవిగా, కట్టుబడి ఉండేవిగా మరియు అమలు చేయబడేవిగా ఉంటాయి (కాని ఏ సందర్భంలోనూ తరగతి, ప్రతినిధి లేదా ప్రైవేట్ అటార్నీ జనరల్ మధ్యవర్తిత్వం ఉండదు). ఈ నిబంధనల ఉపయోగం మరియు సంబంధిత లావాదేవీలు ఫెడరల్ ఆర్బిట్రేషన్ యాక్ట్, 9 U.S.C. సెక్షన్. 1-16 (FAA) మరియు ఒరెగాన్ రాష్ట్ర చట్టాల ప్రకారం వర్తిస్తాయి |