Back

గోప్యతా నోటీసు

BibleProject 

2019 ఆగస్టులో అప్‌డేట్ చేయబడింది

పరిచయము

BibleProject మీ గోప్యతను గౌరవిస్తుంది మరియు మీ సున్నితమైన సమాచారమును రక్షించడానికి కట్టుబడి ఉంది. ఈ గోప్యతా నోటీసు ("గోప్యతా నోటీసు") అనేది మీకు మరియు BibleProject మరియు దాని అనుయాయులు, కార్పొరేట్ పేరెంట్ (లు), మరియు అనుబంధ సంస్థలు (సంఘటితంగా "BibleProject", "మాకు"",", మా," లేదా "మేము") మధ్య thebibleproject.com, సోషల్ మీడియా ఛానళ్ళు, అప్లికేషన్లు మరియు సేవలు (సంఘటితంగా, "వెబ్‌సైట్") తో సహా మా వెబ్‌సైట్లను ప్రాప్యత చేసుకొని ఉపయోగించుకుంటూ కుదుర్చుకున్న ఒక ఒప్పందము, మరియు అది BibleProjectయొక్క వాడుక షరతులచే శాసించబడుతూ మరియు దాని భాగంగా ఉంటుంది.

వ్యక్తిగత సమాచారము

ఈ గోప్యతా నోటీసులో ఉపయోగించబడినట్లుగా, "వ్యక్తిగత సమాచారము" అనగా, ఒక వ్యక్తిని నిర్దిష్టంగా గుర్తించే సమాచారము (అనగా, ఒక పేరు, చిరునామా, టెలిఫోన్ నంబరు, ఇ-మెయిల్ చిరునామా, యూజర్‌నేమ్, లేదా క్రెడిట్ కార్డ్ నంబర్), లేదా వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారానికి నేరుగా అనుసంధానించబడిన ఆ వ్యక్తి గురించిన సమాచారము. వ్యక్తిగత సమాచారములో ఇది చేరి ఉండదు (a) సమస్త సమాచారము, అనగా వెబ్‌సైట్ యొక్క  మీ వాడకము గురించి లేదా సేవలు లేదా వాడుకదారుల యొక్క ఒక సమూహము లేదా విభాగము గురించి మేము సేకరించే సమాచారము, దాని నుండి వ్యక్తిగత గుర్తింపులు లేదా ఇతర వ్యక్తిగత సమాచారము తొలగించబడినది లేదా (b) వ్యక్తికి తిరిగి సులభంగా అనుసంధానింపలేని విధంగా గుర్తించబడిన సమాచారము.

ఈ గోప్యతా నోటీసు, మీ వ్యక్తిగత సమాచారమును సేకరించడం, వాడుకోవడం, నిర్వహించడం, రక్షించడం, మరియు వెల్లడించడం అదేవిధంగా టెలిఫోన్ ద్వారా, మెయిల్ ద్వారా లేదా వ్యక్తిగతంగా మా భౌతిక స్థానాల వద్ద BibleProject తో మీ సంభాషణ వినిమయాల కొరకు మా ఆచరణలను వివరిస్తుంది.

మీ సమాచారము గురించి మరియు దానిని మేము ఎలా చూస్తామో అనే విషయమై మా విధానాలు మరియు ఆచరణలను అర్థం చేసుకోవడానికి దయచేసి ఈ నోటీసును జాగ్రత్తగా చదవండి. 

అంగీకారం

వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేసుకోవడం, వెబ్‌సైట్ పై ఒక వాడుకదారు ప్రొఫైల్ సృష్టించడం, మా స్టూడియోను సందర్శించడం, లేదా BibleProject కు వ్యక్తిగత సమాచారాన్ని సమర్పించడం ద్వారా, మీరు ఈ గోప్యతా నోటీసు మరియు ఈ దిగువ వివరించిన విధంగా మీ వ్యక్తిగత సమాచార సేకరణ మరియు వాడకానికి అంగీకరిస్తున్నారు. మీ నుండి వ్యక్తిగత సమాచారమును సేకరించడం యొక్క వివిధ దశలను మీరు అంగీకరించినట్లుగా మీకు తెలియజేయడానికి మరియు నిర్ధారించడానికి మేము చర్యలు తీసుకుంటాము. ఒకవేళ మీరు మా విధానాలు మరియు ఆచరణలకు అంగీకరించనట్లయితే, మీరు ఈ వెబ్‌సైట్‌లోని కొన్ని భాగాలను యాక్సెస్ పొందలేరు లేదా వాటి నుండి ప్రయోజనం పొందలేరు.

పరిధి 

ఈ గోప్యతా నోటీసు మేము సేకరించే ఈ సమాచారానికి వర్తిస్తుందని దయచేసి తెలుసుకోండి:

 • మీరు ఈ వెబ్‌సైట్‌ సందర్శించినప్పుడు.

 • మీరు మా స్టూడియోను సందర్శించినప్పుడు. 

 • మీరు మీ సమాచారమును మాకు దాఖలు పరచినప్పుడు.

 • మీరు ఒక వాడుకదారు ప్రొఫైల్ సృష్టించినప్పుడు లేదా ఉపయోగించినప్పుడు.

 • మేము మీతో ఇమెయిల్ మరియు ఇతర మాధ్యమాల ద్వారా మీతో కమ్యూనికేట్ చేసినప్పుడు.

 • మా సేవలను అందించడానికి మేము పనిచేసే తృతీయ పక్షాల ద్వారా.

 • మాసేవలను మీరు వాడే క్రమంలో ఉండే ఏవేని ఇతర మాధ్యమాలద్వారా.

మొబైల్ అప్లికేషన్లు, కంటెంట్, లేదా BibleProject చే నిర్వహించబడని వెబ్‌సైట్లతో సహా మరే ఇతర మార్గాల ద్వారానైనా మీ గురించి సేకరించిన సమాచారానికి ఈ నోటీసు వర్తించదు.

న్యాయబద్ధమైన ప్రాతిపదిక

మేము ఈ సందర్భములో మాత్రమే మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాము (a) వర్తించినప్పుడు, మీ అనుమతితో లేదా (b) అలా చేయడానికి ఒకవేళ మాకు చట్టబద్ధమైన ఆసక్తి ఉంటే. మీ సమ్మతిపై ఆధారపడి ఒకవేళ మేము మీ వ్యక్తిగత ససమాచారాన్ని సేకరించి లేదా ఉపయోగిస్తే, ఏవైనా మార్పులను కూడా మేము మీకు తెలియజేస్తాము మరియు అవసరమైన విధంగా తదుపరి అనుమతిని కోరతాము.

పిల్లల గోప్యత

పిల్లల యొక్క వ్యక్తిగత సమాచారానికి సంబంధించి తదుపరి గోప్యతా రక్షణలను అందించాల్సిన అవసరాన్ని BibleProject గుర్తిస్తుంది. చిన్నారి తల్లి, తండ్రి లేదా సంరక్షకుల నుండి సమ్మతి పొందనిదే 16 సంవత్సరాల లోపు పిల్లల నుండి ఏ వ్యక్తిగత సమాచారాన్ని తెలిసి మేము సేకరించము. ఒకవేళ 16 సంవత్సరాల లోపు వయసు ఉన్న ఒక చిన్నారి వెబ్‌సైట్ పై రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే, మేము చిన్నారి రిజిస్ట్రేషన్‌ని యాక్టివేట్ చేయడానికి ముందు, రిజిస్ట్రేషన్ కొరకు మా ఇమెయిల్ నిర్ధారణ ప్రక్రియ ద్వారా చిన్నారి యొక్క తల్లి/తండ్రి లేదా సంరక్షకుల నుండి BibleProject కు అనుమతి అవసరమై ఉంటుంది. చిన్నారి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అభ్యర్థనపై ఒకవేళ చిన్నారి తల్లి/తండ్రి నుండి అభ్యర్థన చేసిన 24 గంటలలోగా అనుమతి పొందనట్లయితే, రిజిస్ట్రేషన్ అభ్యర్థలో భాగంగా చిన్నారి మాకు అందజేసిన వ్యక్తిగత సమాచారం దేన్నైనా మేము తొలగిస్తాము. ఒకవేళ మీరు 16 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండి మరియు మీ తల్లి/తండ్రి లేదా సంరక్షకులు మా వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ మరియు అనుమతి ప్రక్రియను పూర్తి చేయకుంటే, ఈ వెబ్‌సైట్ ను ఉపయోగించవద్దని, వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోళ్ళు లేదా విరాళాలు ఇవ్వవద్దని, వెబ్‌సైట్ యొక్క ఇంటరాక్టివ్ లేదా పబ్లిక్‌గా వ్యాఖ్యానించగలిగే సదుపాయాలను ఉపయోగించవద్దని, లేదా BibleProject కు ఏదేని వ్యక్తిగత సమాచారం అందించవద్దని BibleProject మీకు సూచిస్తుంది.

BibleProject అనేది ఒక 501(c)(3) లాభాపేక్ష రహిత కార్పొరేషన్ మరియు అందువల్ల పిల్లల ఆన్‌లైన్ గోప్యతా పరిరక్షణ చట్టము నుండి మినహాయింపు పొంది ఉంది. ఏది ఏమైనప్పటికీ, మా విషయాంశమును సమాచారయుక్తమైనదిగా కనుగొన్న పిల్లల యొక్క గోప్యతకు BibleProject విలువనిస్తుంది. ఈ గోప్యతా నోటీసు యొక్క నిబంధనలు అన్నీ పిల్లలతో సహా ఈ సైట్ ఉపయోగించే వాడుకదారులందరికీ వర్తిస్తాయి. చిన్న వయస్సులోని సందర్శకులు ఏదైనా వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ పై సమాచారమును పంచుకునే ముందుగా ఎల్లప్పుడూ తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు తెలియజేయాలి, మరియు వ్యక్తిగత సమాచారమును ఆన్‌లైన్లో పంచుకోవడానికి సంబంధించి ఆయా కుటుంబాలు తమ గృహ సంబంధ మార్గదర్శకాలను చర్చించుకోవడానికి మేము ప్రోత్సహిస్తాము.

తల్లి/తండ్రి లేదా సంరక్షకుల అనుమతి లేకుండా 16 సంవత్సరాల లోపు వయసు ఉన్న ఒక చిన్నారి నుండి లేదా చిన్నారి గురించి సమాచారమును BibleProject కలిగియుందని మీరు విశ్వసిస్తే, లేదా BibleProject కలిగియున్న మీ చిన్నారి గురించిన వ్యక్తిగత సమాచారమును సమీక్షించాలనిలేదా తొలగింపును మీరు కోరుకొన్నట్లయితే, దయచేసి మమ్మల్ని webmaster@jointhebibleproject.com పై లేదా టోల్ ఫ్రీ నంబరు (855) 700-9109 పై సంప్రదించండి.

మేము ఎలా మీ వ్యక్తిగత సమాచారమును సేకరించి మరియు ఉపయోగిస్తాము

మీరు మా వెబ్‌సైట్ లేదా స్టూడియోను సందర్శించినప్పుడు, మేము మీ నుండి కొంత వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాము. మేము ఈ సమాచారాన్ని సేకరిస్తాము:

 • మీరు దానిని మాకు అందజేసినప్పుడు నేరుగా మీ నుండి.

 • మీరు వెబ్‌సైట్ నావిగేట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా.

 • తృతీయ-పక్ష వెబ్‌సైట్లతో సహా తృతీయ పక్షాల నుండి.

మీరు గనక మాతో రిజిస్టర్ చేసుకుంటే, మా వెబ్‌సైట్ యొక్క కొన్ని ఆఫర్లు, సేవలు మరియు భాగాలు మీకు మాత్రమే యాక్సెస్ అయ్యేవిగా ఉండవచ్చునని దయచేసి గమనించండి. మా సేవలను అందుకోవడానికి కనీస అవసరమైన కనీస సమాచారమును అందించేటట్లుగా సమాచారాన్ని పరిమితం చేసుకోవడానికి మీకు అవకాశం కల్పించబడుతుంది, మరియు  మీ గురించి మేము కలిగియున్న సమాచారమును ఎడిట్ చేయడానికి మీరు ఏ సమయములోనైనా BibleProject ను సంప్రదించవచ్చు. అయినప్పటికీ, మీరు మీ వ్యక్తిగత సమాచారమును మాకు ఇవ్వడానికి నిరాకరిస్తే, లేదా మీ అనుమతిని ఆ తర్వాత ఉపసంహరించుకుంటే, బహుశా మేము మిమ్మల్ని సంప్రదించము లేదా సేవలను అందించలేము అని దయచేసి గమనించండి.

మీరు మాకు అందించే సమాచారం.

మీరు స్వయంగా మా స్టూడియోను సందర్శించినప్పుడు లేదా వెబ్‌సైట్ పై మాతో సంభాషించినప్పుడు మేము వ్యక్తిగత సమాచారాన్ని నేరుగా సేకరిస్తాము. మీరు మాకు అందించే సమాచారం దీనిని కలిగివుండవచ్చు:

 • సంప్రదింపు సమాచారం - మా వెబ్‌సైట్ పై మీరు ఎలక్ట్రానిక్ ఫారంలను నింపి సమర్పించినప్పుడు మేము మీ పేరు, టెలిఫోన్ నంబరు, ఇ-మెయిల్ చిరునామా మరియు చిరునామాను సేకరిస్తాము. మీరు మా వెబ్‌సైట్ ఉపయోగించడానికి, మీకు వార్తాలేఖలు పంపించడానికి, మరియు మీకు సమాచారము, ఉత్పత్తులు మరియు సేవలను అందించడానికై మిమ్మల్ని రిజిస్టర్ చేసుకోవడానికి మేము ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాము. మీరు మా వెబ్‌సైట్‌తో ఒక సమస్య గురించి రిపోర్టు చేసినప్పుడు కూడా మేము మిమ్మల్ని సమాచారం కోరవచ్చు.

 • యూజర్ ఉత్పత్తి చేసిన విషయం - మా వెబ్‌సైట్ వ్యాఖ్యలు, ఫోటోలు, లేదా ఇతర విషయమును పోస్ట్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే వినియోగ షరతులకు  వర్తించేలా ఉండవచ్చు. ఈ ఫీచర్లను వాడాలా వద్దా అనేది మీ నిర్ణయం మరియు మీరు పోస్టు చేసే ఏదేని సమాచారం లేదా విషయం మీరు స్వఛ్ఛందంగా అందిస్తారు.. ఒకవేళ మీరు యూజర్ ఉత్పత్తి చేసిన విషయాన్ని కాంటాక్ట్ అజ్‌ను పోస్ట్ చేస్తే, మేము మీ ఉత్తరప్రత్యుత్తరాల యొక్క రికార్డులు లేదా కాపీలను (ఇమెయిల్ చిరునామాలతో సహా) ఉంచుకోవచ్చు లేదా మమ్మల్ని సంప్రదించండి.

 • చెల్లింపు సమాచారము - మేము మా వెబ్‌సైట్ ద్వారా చెల్లింపులు మరియు విరాళాలను స్వీకరిస్తాము. చెల్లింపు లావాదేవీలకు మేము తృతీయ-పక్ష చెల్లింపు ప్రాసెసర్ Stripe ను ఉపయోగిస్తాము. మీరు ఒక ఆన్‌లైన్ చెల్లింపు చేసినప్పుడు, వెబ్‌సైట్ మిమ్మల్ని BibleProject యొక్క Stripe చెల్లింపు పోర్టల్ కు తీసుకువెళుతుంది. Stripe, PCI ఆమోదిత ఆన్‌లైన్ చెల్లింపు ప్రక్రియ సేవలను అందిస్తుంది. BibleProject చెల్లింపు సమాచారాన్ని సేకరించదు, ప్రక్రియ చేపట్టదు లేదా భద్రపరచదు, ఐతే మా వెబ్‌సైట్ ద్వారా మీరు చేపట్టే లావాదేవీలు మరియు మీ ఆర్డర్లను పూర్తిచేసిన రికార్డును మావద్ద ఉంచుకోవచ్చు.  ఒక ఆర్డరును ప్రాసెస్ చేయడంలో ఒకవేళ మాకు ఏదైనా ఇబ్బంది ఉంటే, మిమ్మల్ని సంప్రదించడానికి మేము మీ సంప్రదింపు సమాచారాన్ని ఉపయోగిస్తాము.

 • వ్యక్తి స్వీయ సమాచారము- మీరు BibleProject యొక్క స్టూడియోను సందర్శించినప్పుడు, మీరు ఒక విజిటర్ ఇన్‌టేక్ ఫారమును పూర్తి చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరతాము మరియు మీరు భవనం లేదా స్టూడియో స్థలములో ప్రవేశించినప్పుడు లేదా నిష్క్రమించినప్పుడు ఆన్‌సైట్ కెమెరాలను ఉపయోగించి మేము మీ ఫోటోను తీసుకోవచ్చు. మా సిబ్బంది మరియు సందర్శకుల భద్రతకు హామీ ఇచ్చేందుకు మేము ఈ సమాచారాన్ని సేకరిస్తాము. అంతేకాక, మీ సందర్శన యొక్క ఉద్దేశ్యముపై ఆధారపడి, అదనపు ఫారములను పూర్తి చేయమని కూడా మేము మిమ్మల్ని అడగవచ్చు. ఈ ఫారములను సేకరించే సమయములో వీటి యొక్క ఉద్దేశ్యమును మేము మీకు తెలియజేస్తాము.

ఆటోమేటిక్ డేటా సేకరణ టెక్నాలజీల ద్వారా మేము సేకరించే సమాచారము.

మీరు మా వెబ్‌సైట్‌లో ముందుకు వెళ్ళి, ఇంటరాక్ట్ చేస్తున్న సమయంలో మేము మీ పరికరం, మరియు విధానాలకు సంబంధించిన  నిర్దిష్ట సమాచారమును సేకరించడానికి మేము వెబ్‌సైట్ విశ్లేషణలు వంటి ఆటోమేటిక్ డేటా సేకరణ టెక్నాలజీలను  ఉపయోగించవచ్చు. మేము ఈ సమాచారాన్ని వెబ్‌సైట్ నిర్వహణ మరియు ఉన్నతీకరణవంటి చట్టబద్ధమైన ప్రయోజనాలను సాధించడానికి మరియు మా ఔట్‌రీచ్ మరియు మార్కెటింగ్ ప్రయత్నాలను అంచనావేయడానికి సేకరిస్తాము. ఆటోమేటిక్ డేటా సేకరణ టెక్నాలజీల ద్వారా మేము సేకరించే సమాచారములో ఇవి ఉంటాయి:

 • లాగ్ ఫైల్స్- మేము మీ కంప్యూటర్ నుండి ట్రాఫిక్ డేటా, లొకేషన్ డేటా, లాగ్స్ మరియు ఇతర కమ్యూనికేషన్ డేటా మరియు వెబ్‌సైట్ పై మీరు యాక్సెస్ చేసుకొని ఉపయోగించే వనరులతో సహా అప్రకటిత మరియు సాంకేతిక సమాచారాన్ని సేకరిస్తాము. మీ ఐపి చిరునామా, ఆపరేటింగ్ సిస్టమ్, ఉపకరణం రకం, మరియు బ్రౌజర్ రకంతో సహా మేము మీ కంప్యూటర్, ఉపకరణం, మరియు ఇంటర్నెట్ కనెక్షన్ గురించి కూడా సమాచారం సేకరిస్తాము. మేము ఈ సమాచారాన్ని గుప్తంగా ఉంచినందువల్ల అది మిమ్మల్ని గుర్తించదు మరియు యూజర్ ప్రవర్తనను పర్యవేక్షించుటకు ఉపయోగించబడదు. మేము ఈ సమాచారాన్ని, మా ప్రేక్షకుల సైజు మరియు వాడకపు విధానాలను అంచనా వేయడానికి, మీ ప్రాధాన్యతల గురించి సమాచారాన్ని నిల్వ చేయడానికి, మీ యూజర్ అనుభవాన్ని అనుకూలపరచడానికి, శోధన స్పందన సమయాలను వేగవంతం చేయడానికి మరియు మీరు వెబ్‌సైట్ కి తిరిగి వచ్చినప్పుడు మిమ్మల్ని గుర్తించడానికి కూడా ఉపయోగిస్తాము. మా వెబ్‌సైట్‌ని ఉన్నతీకరించడానికి మరియు మరిన్ని పర్సనలైజ్ చేయబడిన సేవలను అందించడానికి ఈ విశ్లేషణలు మాకు సహాయపడతాయి 

 • ఇమెయిల్స్- స్వీకర్త ఇమెయిల్ ని ఎప్పుడు అందుకుంటారు మరియు ఎప్పుడు ఓపెన్ చేస్తారు మరియు ఇమెయిల్ లోని లింక్ ద్వారా స్వీకర్త ఎప్పుడు మా వెబ్‌సైట్ సందర్శిస్తారు అని ట్రాక్ చేయడానికి గాను మా ఇమెయిల్స్ ఎంబెడ్ చేయబడిన ఒక ట్రాకింగ్ కోడ్ ని కలిగి ఉంటాయి.

 • కుకీలు- అనేక వాణిజ్యపరమైన వెబ్‌సైట్ల లాగానే, మా వెబ్‌సైట్ యొక్క వాడకమును ట్రాక్ చేయడానికి మేము కుకీలు ఉపయోగిస్తాము. మేము కుకీలను ఎలా ఉపయోగిస్తామనే దాని గురించి మరింత సమాచారం కోసం దయచేసి మాకుకీ నోటీసును  చదవండి.

మేము సేకరించే ఆటోమేటిక్ గా సమాచారములో వ్యక్తిగత సమాచారము చేరి ఉండవచ్చు, లేదా మేము సమాచారమును నిర్వహణ చేయవచ్చు లేదా ఇతర మార్గాలలో మేము సేకరించే లేదా తృతీయ పక్షాల నుండి సేకరించే వ్యక్తిగత సమాచారముతో దానిని అనుసంధానం చేయవచ్చు. ఈ సమాచారమును సైట్ సందర్శకులు మరియు రద్దీ గురించిన సమస్త సమాచారము లోనికి కలిపివేయవచ్చు. ఈ పేరాగ్రాఫులో వివరించబడిన విధంగా ఒకవేళ BibleProject గనక మీ అప్రకటిత సమాచారము మరియు సాంకేతిక సమాచారాన్ని సేకరించడం మరియు ఉపయోగించుకోవడం మీకు ఇష్టం లేకుంటే, వెబ్‌సైట్ వాడకాన్ని తక్షణమే ఆపివేయండి, లేదాక్రింద ఇవ్వబడిన "మీ వ్యక్తిగత సమాచార నియంత్రణ" లో వివరించబడినట్లుగా మమ్మల్ని సంప్రదించండి.

ఇతర వెబ్‌సైట్ల నుండి మేము సేకరించే సమాచారము

మా సోషల్ మీడియా ప్రకటనలు మరియు పోస్టుల సమర్థతను కొలిచే మా చట్టబద్ధమైన ఆసక్తిని సాధించడానికి గాను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల (ఉదా: ఫేస్‌బుక్, యూట్యూబ్ లేదా ట్విట్టర్) నుండి మా వెబ్‌సైట్ కు వచ్చే యూజర్ల సంఖ్యను BibleProject ట్రాక్ చేస్తుంది.   ఒకవేళ మీరు ఒక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ నుండి మా వెబ్‌సైట్ ని యాక్సెస్ చేసుకుంటే, లేదా ఒక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌తో మీ ఖాతాను అనుసంధానం చేయడానికి మీరు ఇతరత్రా అంగీకరిస్తే, అట్టి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ నుండి కూడా మీ గురించిన వ్యక్తిగత సమాచారాన్ని మేము తీసుకోవచ్చు. మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము సేకరించగలిగే సోషల్ మీడియా సైట్లు BP చే నియంత్రణ లేదా అజమాయిషీలో ఉండవని దయచేసి గమనించండి. సోషల్ మీడియా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా సేకరిస్తుంది మరియు ప్రక్రియ జరుపుతుందనే దానిపై ఏవైనా ప్రశ్నలను సోషల్ మీడియా సైట్ ప్రొవైడర్‌కు పంపవలసి ఉంటుంది. మేము ఈ సమాచారాన్ని మీ నుండి నేరుగా సేకరించిన సమాచారముతో నిలిపి ఉంచుకోవచ్చు.

మేము మీ సమాచారాన్ని ఉపయోగించగలిగే ఇతర మార్గాలు

మీ నుండి లేదా మీ గురించి మేము సేకరించే వ్యక్తిగత సమాచారాన్ని మేము దీనికి కూడా ఉపయోగించవచ్చు:

 • మా ఉత్పత్తులు మరియు సేవలను అభివృద్ధిపరచుట మరియు మెరుగుపరచుట.

 • మా వెబ్‌సైట్ మరియు అందులోని విషయాలను మీకు అందజేయడం.

 • మీరు మా నుండి కోరే సమాచారము, ఉత్పత్తులు లేదా సేవలను మీకు అందజేయడం.

 • మీరు ఎందుకోసమైతే అందించారో ఆ ఇతర అవసరాలను నెరవేర్చడం.

 • మా కర్తవ్యబాధ్యతలను చేపట్టడం మరియు మీకు, మాకు మధ్య ఉన్న బిల్లింగ్ మరియు సేకరణతో సహా ఏవేని ఒప్పందాల నుండి ఉత్పన్నమయ్యే మా హక్కులను అమలు పరచడం. 

 • మా వెబ్‌సైట్ లేదా దాని ద్వారా మేము ఆఫర్ చేసే లేదా అందించే ఏవైనా ఉత్పత్తులు మరియు సేవలకు మార్పుల గురించి మీకు తెలియజేయడం.

 • మా వెబ్‌సైట్ పై ఇంటరాక్టివ్ ఫీచర్లలో పాల్గొనడానికి మిమ్మల్ని అనుమతించడం.

 • మీ గోప్యతను పరిరక్షించుటకు మరియు ఈ గోప్యతా నోటీసును అమలు పరచుటకు.

 • మా హక్కులు మరియు ఆస్తిని పరిరక్షించుటకు.

 • మీకు, BibleProject కు, లేదా ఇతరులకు లేదా చట్టము, నిబంధనలు, చట్టబద్ధ ప్రక్రియ లేదా కోర్టు ఉత్తర్వుతో సమ్మతి వర్తింపుకు నష్టం కలిగించగల వ్యక్తులు లేదా సంస్థలను గుర్తించి, సంప్రదించి లేదా వారిపై చట్టబద్ధమైన చర్య తీసుకోవడం అవసరమని మేము విశ్వసించినట్లయితే.

 • మీరు సమాచారమును అందించునప్పుడు ఏదైనా ఇతర మార్గములో మేము వివరించవచ్చు.

 • మీ అనుమతితో మరేదేని ఇతర వినియోగార్థమై.

మీరు ఆసక్తి చూపే వ్యాపార ప్రకటనలు లేదా ఆఫర్లను గుర్తించుటలో సహాయపడేందుకు గాను మా వెబ్‌సైట్‌పై మీ వ్యక్తిగత సమాచారము మరియు కార్యకలాపాలను సేకరించి మరియు విశ్లేషించుటకు BibleProject ఒక కుకీని లేదా తృతీయ పక్షపు బీకాన్ (అనగా., క్లిక్ స్ట్రీమ్ సమాచారము, బ్రౌజర్ రకం, సమయం మరియు తేదీ, క్లిక్ చేయబడిన లేదా స్క్రోల్ చేసిన విషయము)  ను ఉపయోగించవచ్చు. రూపొందించబడిన విషయము మరియు వ్యాపారప్రకటనను మీకు అందించడానికి గాను మీ ఆన్‌లైన్ ప్రవర్తన ఆధారంగా సమాచారమును BibleProject ఉపయోగించరాదని ఒకవేళ మీరు ఒకవేళ భావిస్తే, మీరు‌ఆప్టింగ్ అవుట్ ఆఫ్ కమ్యూనికేషన్స్లోని సూచనలను పాటిస్తూ, ఆన్‌లైన్ ప్రవర్తనా ప్రకటన నుండి బయటకు వెళ్ళీపోవచ్చు.

ఇతర సమాచారముతో సర్వీసెస్ ద్వారా మీ గురించి మేము సేకరించిన సమాచారాన్ని, తృతీయ పక్ష వనరుల నుండి మీ గురించి మేము సేకరించిన  సమాచారంతో కలుపవచ్చు. పరిమితి పరంగా కాకుండా, ఉదాహరణ పరంగా, మీ ఖాతాకు సంబంధించిన మా వద్దవున్న రికార్డులు ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మార్చిన చిరునామా లేదా ఇతర జాబితా సేవను మేము ఉపయోగించవచ్చు.

మీ సమాచార వెల్లడి

మీ వ్యక్తిగత సమాచారాన్ని BibleProject మరే ఇతర తృతీయ పక్షాలకు విక్రయించదు. మేము సేకరించే లేదా మీరు అందించే వ్యక్తిగత సమాచారాన్ని ఈ గోప్యతా నోటీసులో వివరించబడిన విధంగా మేము బహిర్గతం చేయవచ్చు:

 • మా సహ-సంస్థలు లేదా అనుబంధ సంస్థలకు.

 • కాంట్రాక్టర్లు, చెల్లింపు ప్రాసెసర్లు, సర్వీస్ ప్రొవైడర్లు, మరియు మా వ్యాపారానికి మద్దతునిచ్చేందుకు మేము ఉపయోగించే ఇతర తృతీయ పక్షాలకు. 

 • మా వెబ్‌సైట్ వినియోగదారులకు సంబంధించిన BibleProject వద్ద ఉన్న వ్యక్తిగత సమాచారం, ప్రస్తుతం నడుస్తున్న లేదా దివాలా, వ్యాపార పరిసమాప్తి లేదా ఇటువంటి ఇతర ప్రొసీడింగ్స్‌లో భాగం అయినట్లయితే, ఏదైనా BibleProject యొక్క ఆస్తుల విలీనం, పునర్నిర్మాణం, పునర్వ్యవస్థీకరణ, రద్దు లేదా ఇతర అమ్మకం, కొన్నింటి బదలాయింపుకు సంబంధించి అట్టి కొనుగోలుదారు లేదా ఇతర వారసులకు.

 • మా వ్యాపారప్రకటనకర్తలు మరియు Google Analytics వంటి విశ్లేషణ భాగస్వాములకు. ఈ తృతీయ పక్ష కంపెనీల యొక్క గోప్యతా నోటీసు, మీ సమాచారము యొక్క వారి సేకరణ, వాడుక మరియు వెల్లడింపుకు వర్తిస్తుంది. ఈ అధ్యయనాలు మరియు/లేదా విశ్లేషణలను నిర్వహించే నిమిత్తం, తృతీయ పక్షాలు మీ సమాచారాన్ని ఇతర వినియోగదారుల సమాచారముతో కలుపవచ్చు. మరింత సమాచారం కోసం, దయచేసి Google Analytics Opt-out Browser Add-onను దర్శించండి.

 • మీరు దానిని అందించిన ఉద్దేశ్యమును నెరవేర్చుటకు. ఉదాహరణకు, ఒకవేళ మీరు మా వెబ్‌సైట్ యొక్క "ఒక స్నేహితుడికి ఇమెయిల్ చేయండి" ఫీచర్ ఉపయోగించడానికి మీరు మాకు ఒక ఇమెయిల్ చిరునామాను ఇచ్చినట్లయితే, ఆ ఇమెయిల్ యొక్క విషయాలు మరియు మీ ఇమెయిల్ చిరునామాను మేము స్వీకర్తలకు అందజేస్తాము.

 • మీరు సమాచారము ఇచ్చినప్పుడు మాచే వెల్లడి చేయబడిన ఏదేని ఇతర అవసరాల నిమిత్తం.

 • మ్ అనుమతితో.

ఈ క్రింది విధంగా కూడా మేము మీ వ్యక్తిగత సమాచారమును వెల్లడించవచ్చు:

 • ఏదైనా ప్రభుత్వ లేదా నిబంధన సంబంధిత అభ్యర్థనకు స్పందించడంతో సహా ఏదైనా కోర్టు ఉత్తర్వు, చట్టము, లేదా చట్టబద్ధ ప్రక్రియకు వర్తించజేయవలసినట్లయితే. 

 • బిల్లింగ్ మరియు సేకరణ వినియోగాలతో సహా మా వాడుక నిబంధనలు మరియు ఇతర ఒప్పందాలను అమలుపరచుటకు లేదా వర్తింపజేసేందుకు.

 • BibleProject, మా కస్టమర్లు, లేదా ఇతరుల హక్కులు, ఆస్తి, లేదా భద్రతను పరిరక్షించడానికి గాను వెల్లడింపు అవసరమని లేదా సముచితమని మేము విశ్వసించినట్లయితే.

సమస్త సమాచారము

మేము సమస్త సమాచారమును లేదా గుర్తింపు-విడదీసిన సమాచారమును ఎటువంటి ఆంక్ష లేకుండా పంచుకోవచ్చు. మేము పంచుకున్న సమాచారము మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించదు. అయినప్పటికీ, తృతీయ పక్షాలు మీ గురించి కలిగియున్న సమాచారముతో, లేదా మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించుటకు వారికి వీలు కల్పించే తీరులో ఇతర తృతీయ పక్షాల నుండి వారు అందుకునే సమాచారముతో ఈ సమస్త సమాచారమును కలపడానికి అవకాశం ఉంటుంది.   

మీ వ్యక్తిగత సమాచారాన్ని నియంత్రించుట

ఒకవేళ మీరు యూరోపియన్ యూనియన్ నివాసితులైతే, మీ వ్యక్తిగత సమాచారానికి సంబంధించి మీకు కొన్ని అదనపు హక్కులు ఉంటాయి. టోల్ ఫ్రీ నంబరు (855) 700-9109 పై మమ్మల్ని సంప్రదించడం ద్వారా లేదా webmaster@jointhebibleproject.com మీ వ్యక్తిగత సమాచారము యొక్క వినియోగం గురించి మీరు మీ హక్కులను ప్రకటించవచ్చు, ఆందోళనలను వ్యక్తపరచవచ్చు, లేదా అదనపు సమాచారమును పొందవచ్చు.


మీకు ఈ హక్కు ఉంటుంది...

మీ కోసం ఇది ఏం చేస్తుంది

మీరు ఏమి చేయవచ్చు

మీ వ్యక్తిగత సమాచారం ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

మీ వ్యక్తిగత సమాచారమును మేము ఎలాఉపయోగిస్తాము, ఏ అవసరాలకోసం మరియు ఇంకా ఎవరు దానికి ప్రాప్యత కలిగి ఉండవచ్చు అనేదాని గురించి మేము ఈ గోప్యతా నోటీసు ద్వారా మీకు తెలియజేస్తాము. 

దయచేసి ఈ గోప్యతా నోటీసును జాగ్రత్తగా చదవండి మరియు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి.

మీ వ్యక్తిగత సమాచారమును యాక్సెస్ చేసుకోండి.

కోరిన మీదట, మీ గురించి మా వద్ద ఉన్న సమాచార విభాగాలను తెలియజేస్తూ, దానిని మేమెలా సేకరించాము, దాన్ని మేమెలా ఉపయోగిస్తాము, మరియు దానికి యాక్సెస్ ఎవరికి ఉంది అనేదాన్ని వివరిస్తూ, మేము  గురించి మా వద్ద ఉన్న మీ వ్యక్తిగత సమాచారానికి యాక్సెస్ ఇస్తాము. 

మీకు సంబంధించి మేము ప్రాసెస్ చేసిన వ్యక్తిగత సమాచారము యొక్క ఒక కాపీని అందించాల్సిందిగా మీరు మమ్మల్ని కోరవచ్చు. కొన్ని సందర్భాలలో, యాక్సెస్ కొరకు ఒక అభ్యర్థనను మొత్తంగా లేదా పాక్షికంగా మేము చట్టబద్ధంగా అనుమతించవచ్చు లేదా తిరస్కరించవలసి రావచ్చు.

కొన్ని పరిస్థితులలో మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేయకుండా నిరోధించండి.

మేము, కొన్ని సందర్భాలలో మరియు చట్టముచే అవససరమయినంతవరకు, మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము ప్రాసెస్ చేయడాన్ని పరిమితం చేస్తాము.

ఒకవేళ (i) వ్యక్తిగత సమాచారము అసంబద్ధంగా ఉంటే, (ii) ప్రాసెస్ చేయడం న్యాయబద్ధం కాకుంటే, (iii) వ్యక్తిగత సమాచారము ఇక మాకు ఏ మాత్రమూ అవసరం లేకుంటే, లేదా (iv) అభ్యంతరం తెలిపే మీ హక్కును మీరు వినియోగించుకుంటే (దిగువన చూడండి) మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేయడాన్ని పరిమితం చేయాల్సిందిగా మీరు కోరవచ్చు.

మా వద్ద ఉన్న మీ గురించి వ్యక్తిగత సమాచారాన్ని సరిచేయండి.

మేము ప్రాసెస్ చేసే వ్యక్తిగత సమాచారం యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారించుకోవడానికి మేము చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

మీకు సంబంధించి మావద్ద ఉన్న వ్యక్తిగత సమాచారము సరికానిదని మీరు కనుగొన్నట్లయితే, లేదా మీ వ్యక్తిగత సమాచారము మారినచో (అనగా., ఒక పేరు లేదా చిరునామా మార్పు), దయచేసి మాకు తెలియజేయండి, మేము మా రికార్డులను సరిచేసుకుంటాము. 

డేటా పోర్టబిలిటీ

కొన్ని పరిస్థితులలో, మీ కోరిక మీదట మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని మరొక సంస్థకు బదిలీ చేయవలసిన అవసరం రావచ్చు.

మీ సంబంధించి మా వద్ద ఉన్న మీ వ్యక్తిగత సమాచారాన్ని ఒక నిర్మాణాత్మకమైన, సాధారణంగా ఉపయోగించబడే మెషీన్ పఠన ఫార్మట్‌లో మరొక సంస్థకు బదిలీ చేయమని మమ్మల్ని కోరే హక్కు మీకు ఉంటుంది. 

మీ వ్యక్తిగత సమాచారాన్ని తుడిచివేయుట (అనగా, "మరచిపోయే హక్కు").

కొన్ని సందర్భాలలో మరియు చట్టము ద్వారా మేము అలా చేయవలసి వచ్చిన చోట, మీ కోరికపై మీకు సంబంధించి మావద్ద ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని మేము తొలగించాల్సి ఉంటుంది. ఈ హక్కు సంపూర్ణమైనది కాదు. మీ అభ్యర్థనతో మేము సమ్మతి వహించాల్సిన అవసరంలేని సందర్భాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది.

మీ వ్యక్తిగత సమాచారాన్ని తొలగించివేయమని మమ్మల్ని కోరే హక్కు మీకు ఉంటుంది. ఒకవేళ మీరు ఈ అభ్యర్థన చేసినట్లయితే, సంబంధిత వ్యక్తిగత సమాచారాన్ని తొలగించమని మమ్మల్ని కోరే మీ హక్కుపై మేము కొన్ని చట్టబద్ధమైన, ఒప్పందపరమైన మరియు వ్యాపార ప్రయోజనాలను సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది. 

మీ వ్యక్తిగత సమాచారము యొక్క కొంత ప్రక్రియ జరపడానికి అభ్యంతరపరచుట.

ఒకవేళ మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేసినట్లయితే, మేము కొన్ని చట్టబద్ధమైన, ఒప్పందపరమైన మరియు వ్యాపార ప్రయోజనాలు మరియు బాధ్యతలను పరిగణించి, ప్రాసెసింగ్‌ను అభ్యంతరపరచడంపై మీకు గల హక్కుపై వాటిని సమతుల్యం చేసుకుంటాము.  

కొన్ని సందర్భాలలో మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి  అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. ప్రత్యక్ష మార్కెటింగ్ అవసరాల కొరకు మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించడానికి కూడా మీరు అభ్యంతరం తెలుపవచ్చు.

ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ ద్వారా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి లోబడకుండుట (అనగా మానవ జోక్యం లేకుండా మీ గురించి ఒక కంప్యూటర్ లేదా ఆల్గరిథంచే ఒక నిర్ణయం చేయబడుట). 

కొన్ని సందర్భాలలో, ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ ద్వారా తీసుకొనే నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేసే హక్కును మేము మీకు ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. మేము మా ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ అభ్యాసాల యొక్క రికార్డులను కూడా ఉంచుకోవాల్సి ఉంటుంది మరియు ఈ నిర్ణయాలు చేయబడిన విధానం గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

ఒక నిర్ణయం మానవ ప్రమేయం లేకుండా పూర్తిగా ఒక కంప్యూటర్ లేదా ఆల్గరిథంచే చేయబడినట్లయితే, ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ ద్వారా చేయబడిన ఆ నిర్ణయానికి మీరు అభ్యంతరం తెలుపవచ్చు.

ఈ హక్కులలో దేనినైనా సాధించుకోవడానికి మేము మీ పూర్తిస్థాయి అభ్యర్థన స్వీకరించిన 30 రోజులలోగా అట్టి అభ్యర్థనను పూర్తిచేస్తాము. ఆ సమాచారంలో ఏవైనా పొరపాట్లు ఉంటే మీకు వాటిని సరిదిద్దే హక్కుకూడా ఉంటుంది. మీ అభ్యర్థనను నెరవేర్చడానికి ముందు మీ గుర్తింపును సరిచూసే చట్టబద్ధమైన ఆవశ్యకతను BibleProject కలిగి ఉంటుందని దయచేసి గమనించండి, అందులో మీ నుండి అదనపు వ్యక్తిగత సమాచారమును సేకరించడం చేరి ఉండవచ్చు.

BibleProject 501 SE 14వ అవెన్యూ పోర్ట్ లాండ్, OR 97214 కు మెయిల్ ద్వారా

కాలిఫోర్నియా గోప్యతా హక్కులు

BibleProject తన వాటాదారులు లేదా ఇతర స్వంతదారుల యొక్క లాభాపేక్ష లేదా ఆర్థిక ప్రయోజనాల కొరకు ఏర్పాటు చేయబడలేదు లేక పనిచేయడం లేదు కావున, మేము కాలిఫోర్నియా వినియోగదారు గోప్యతా చట్టము చట్టం వర్తింపు నుండి మినహాయింపు పొందివున్నాము. ("CCPA"; Ca. పౌరస్మృతి విభాగాలు 1798.100 - 1798.199). అయినప్పటికీ, సర్వీస్ ప్రొవైడర్లు మరియు ఇతర తృతీయ పక్షాలతో మేము కలిగివున్న కొన్ని ఒప్పందాలు కొన్ని, మాకు CCPA  వర్తించే ఆవశ్యకతను కలిగి ఉండవచ్చు. కాలిఫోర్నియా నివాసితులుగా ఉన్న మా వెబ్‌సైట్ యూజర్లు వారి వ్యక్తిగత సమాచారమునకు సంబంధించి కొన్ని హక్కులను కలిగి ఉండవచ్చు, అవి ఇటువంటివై ఉండవచ్చు (a) మేము మీ గురించి సేకరించిన వ్యక్తిగత సమాచారము యొక్క విభాగాలను వివరిస్తూ, మరియు ఆ సమాచారము ఒక తృతీయ పక్షానికి అమ్మబడిందా అనే సమాచారం అందుకొనుట; (b) మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకున్న తృతీయ పక్షాల యొక్క విభాగాల జాబితా అందుకొనుట; (c) ఒకవేళ మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని అమ్మితే, తృతీయ పక్షాలకు మీ వ్యక్తిగత సమాచారాన్ని అమ్మవద్దని మాకు సూచించుట; మరియు (d) మీరు మీ గోప్యతా హక్కులను ఉపయోగించుకుంటున్నదానితో సంబంధం లేకుండా సమాన సేవను అందుకొనుట.

అదనంగా, కాలిఫోర్నియా పౌరస్మృతి, విభాగాలు 1798.83-1798.84 మార్కెటింగ్ ఆవశ్యకతల కొరకు మేము అనుబంధ వ్యక్తులు మరియు/లేదా తృతీయ పక్షాలతో పంచుకునే వ్యక్తిగత సమాచారము యొక్క విభాగాలను గుర్తించే ఒక నోటీసును మమ్మల్ని అడిగేందుకు కాలిఫోర్నియా నివాసితులకు అర్హత కల్పిస్తాయి మరియు అట్టి అనుబంధ వ్యక్తులు మరియు/లేదా తృతీయ పక్షాలకు సంప్రదింపు సమాచారమును అందిస్తాయి.

ఒకవేళ మీరు కాలిఫోర్నియా నివాసితులై ఉండి మరియు మీరు ఈ గోప్యతా నోటీసు యొక్క ఒక కాపీని కోరాలనుకుంటే లేదా వర్తించే కాలిఫోర్నియా చట్టం క్రింద మీకు లభించే మీ హక్కుల్ని వినియోగించుకోవాలనుకుంటే, దయచేసి మాకు టోల్ ఫ్రీ నంబరు (855) 700-9109 పైకాల్ చేయండి లేదా  webmaster@jointhebibleproject.com పై సబ్జెక్ట్ లైన్‌లో "కాలిఫోర్నియా గోప్యతా సమాచారం కొరకు అభ్యర్థన" తో ఇమెయిల్ చేయండి.

కమ్యూనికేషన్స్ నుండి వైదొలగడం

మీరు మా నుండి వినాలనుకుంటే మాత్రమే మేము మీతో సంభాషించాలనుకుంటాము. BibleProject మీకు పంపించే సమాచార వినిమయాలను మీరు మా ఇమెయిల్స్ అడుగుభాగములోనైనా ఉండే "unsubscribe" లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మార్చవచ్చు లేదా పరిమితం చేయవచ్చు. మీరు మమ్మల్ని నేరుగా టోల్ ఫ్రీ నంబరు (855) 700-9109 పై కూడా సంప్రదించవచ్చు లేదా webmaster@jointhebibleproject.com కు ఇమెయిల్ చేయవచ్చు. దయచేసి మీ పూర్తి పేరు, ఇమెయిల్ చిరునామా, మెయిలింగ్ చిరునామా, మరియు ప్రత్యేకించి మీరు ఏ సమాచారం అందుకోవాలనుకుంటున్నారో వ్రాసేటట్లుగా చూసుకోండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే, మాకు పంపే సందేశములో ఈ క్రింది వాటిలో ఒక వాక్యాన్ని ఉపయోగించవచ్చు:

 • ఉత్పత్తులు మరియు సేవలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు, లేదా రాబోవు ఈవెంట్లకు సంబంధించిన అప్‌డేట్లు వంటి ఇమెయిల్ ప్రకటనలను నేను అందుకోదలచుకోలేదు. 

ఉత్పత్తులు మరియు సేవలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు, లేదా రాబోవు ఈవెంట్లకు సంబంధించిన కాలానుగత కేటలాగులు మరియు మెయిలింగ్స్ వంటి ప్రత్యక్ష మెయిల్ ప్రకటనల్ని నేను అందుకోదలచుకోలేదు.

Do Not Track సిగ్నల్స్ 

Do Not Track అనేది వాడుకదారులు తమ వెబ్ బ్రౌజర్లలో ఏర్పాటు చేసుకోగలిగిన ఒక గోప్యతా ప్రాధాన్యత. ఒక వాడుకదారు Do Not Track సిగ్నల్ ని ఆన్ చేసినప్పుడు, ఆ వాడుకదారును ట్రాక్ చేయవద్దని బ్రౌజరు వెబ్‌సైట్లను కోరుతూ ఒక సందేశం పంపిస్తుంది. Do Not Track గురించి సమాచారం కోసం, www.allaboutdnt.org ని సందర్శించండి. thebibleproject.com ఈ సమయములో Do Not Track బ్రౌజర్ సెట్టింగ్స్ లేదా సిగ్నల్స్ కు స్పందించదు. అదనంగా, మా వెబ్‌సైట్ల సందర్శకులను ట్రాక్ చేయడానికి ఇంటర్‌నెట్‌కు ప్రామాణికమైన ఇతర టెక్నాలజీని మేము ఉపయోగించవచ్చు. మీరు Do Not Track సిగ్నల్ ని ఆన్ చేసియున్నప్పటికీ , మీ గురించి మరియు మీ ఇంటర్‌నెట్ కార్యకలాపం గురించి గురించి సమాచారాన్ని సేకరించడానికి మాచే ఆ సాధనాలు ఉపయోగించబడవచ్చు. 

యు.ఎస్. గోప్యత చట్టాలు

ఈ వెబ్‌సైట్ యునైటెడ్ స్టేట్స్ లో స్వంతమై ఉండి పనిచేయబడుతూ ఉంది. ఒకవేళ మీరు యునైటెడ్ స్టేట్స్ బయటినుండి ఈ వెబ్‌సైట్ ని యాక్సెస్ చేసుకొన్నట్లయితే, మీ గురించి మేము సేకరించే ఏ సమాచారమైనా యునైటెడ్ స్టేట్స్ లోపలి సేవలకు బదిలీ చేయబడుతుంది. యునైటెడ్ స్టేట్స్ లోని గోప్యత చట్టాలు మీ పరిధిలో ఉన్నంత రక్షణాత్మకంగా ఉండకపోవచ్చు. మీ గురించిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించుటకు మమ్మల్ని అనుమతించడం ద్వారా, ఈ గోప్యతా నోటీసులో వివరించినట్లుగా మీరు మీ వ్యక్తిగత సమాచారము యొక్క అట్టి బదిలీ మరియు ప్రాసెసింగ్ కు సమ్మతిని తెలియజేస్తున్నారు.  

డేటా భద్రత

మీ వ్యక్తిగత సమాచారము ఆకస్మికంగా కోల్పోవడం మరియు అనధీకృత యాక్సెస్, వాడకము, మార్పుచేర్పులు మరియు వెల్లడి నుండి రక్షించడానికి మేము ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ లో వాణిజ్యపరంగా సహేతుకమైన చర్యలను అమలు చేశాము. బహిర్గత పరచని మీ వ్యక్తిగత సమాచారమును రక్షించడానికి మేము భౌతిక, ఎలక్ట్రానిక్ మరియు విధానపరమైన భద్రతా చర్యలను చేపడతాము. ఈ రక్షణ చర్యలలో మీ వ్యక్తిగత సమాచారము యొక్క మా ఇన్-హౌస్ నిల్వను సంప్రదింపు సమాచారానికే పరిమితి చేయడం, డేటాను పరిశ్రమ ప్రామాణిక ఎన్‌క్రిప్షన్ తో భద్రపరచడం వంటివి ఉంటాయి.. చెల్లింపు మరియు ఆర్థికపరమైన సమాచారము, ఒక చెల్లింపు కార్డు పరిశ్రమ డేటా రక్షణ ప్రామాణికత వర్తించే హోస్టింగ్ ప్రొవైడర్‌పై హోస్ట్ చేయబడుతుంది. మేము ఇతర వ్యక్తిగత సమాచారము అంతటినీ, ఒక సురక్షిత టోకెన్ ద్వారా ఆ సర్వీస్ ప్రొవైడర్ భద్రపరచి, భద్రతా ప్రమాణాలను నెరవేర్చే ఒక సర్వీస్ ప్రొవైడర్‌కు బదిలీ చేస్తాము. మీకు సంబంధించిన మా సమాచార రక్షణను మెరుగుపరచడానికి మరియు ఆ సమాచారము యొక్క సమగ్రతను మీకు భరోసా కల్పించడానికి మేము మా టెక్నాలజీని ఆధునీకరించి మరియు పరీక్షిస్తాము.

సమాచారము యొక్క భద్రత మరియు రక్షణ కూడా మీపై ఆధారపడి ఉంటుంది. మా వెబ్‌సైట్ యొక్క కొన్ని భాగాలను యాక్సెస్ చేసుకోవడానికి మీకు ఒక పాస్‌వర్డ్ ఇవ్వబడినప్పుడు (లేదా మీరు ఎంచుకొన్నప్పుడు), ఈ పాస్‌వర్డ్ ని రహస్యంగా ఉంచుకొనే బాధ్యత మీదే అయి ఉంటుంది. మీ పాస్‌వర్డ్ మరెవ్వరితోనూ పంచుకోవద్దని మేము మిమ్మల్ని కోరుతున్నాము. మీ సందర్శనను పూర్తి చేసినప్పుడు మీ ఖాతాను లాగాఫ్ చేసి మీ బ్రౌజర్ విండోను మూసివేయాల్సిందిగా జ్ఞాపకం ఉంచుకోండి. ప్రత్యేకించి, ఒకవేళ మీరు మరొకరితో కంప్యూటరును పంచుకుంటూ ఉంటే లేదా బహిరంగ ప్రదేశములో ఒక కంప్యూటరును ఉపయోగిస్తూ ఉంటే, ఇతరులు మీ ఖాతాను యాక్సెస్ చేయకుండా ఉండేలా చూసుకోవడానికి ఇలా చేయాలి.  తమ వ్యక్తిగత సమాచారాన్ని  తాము ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మరియు వెల్లడిస్తున్నారు అనేదానిపై ఇంటర్‌నెట్ వినియోగదారులందరూ శ్రద్ధ తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మీరు పంచుకునే యూజర్ జనరేటెడ్ కంటెంట్ మరియు ఇతర సమాచారాన్ని వెబ్‌సైట్ యొక్క వాడకందారులు ఎవరైనా చూడవచ్చు.

దురదృష్టవశాత్తూ, ఇంటర్‌నెట్ ద్వారా సమాచార ప్రసారం వ్యాప్తి పూర్తిగా సురక్షితం కాదు. మీ వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించడానికి మేము మా శాయశక్తులా కృషి చేసినప్పటికీ, మా వెబ్‌సైట్‌కి ప్రసారం చేసిన మీ వ్యక్తిగత సమాచారము యొక్క భద్రతకు మేము హామీ ఇవ్వలేము లేదా ఆ అనధీకృత తృతీయ పక్షాలు మా భద్రతా చర్యలను ఛేదించలేరు లేదా అనుచితమైన ఉద్దేశ్యాల కొరకు బహిరంగం-కాని వ్యక్తిగత సమాచారమును ఉపయోగించరు. వ్యక్తిగత సమాచారము యొక్క ఏదేని ప్రసార వ్యాప్తి మీ స్వంత బాధ్యతపై ఉంటుంది. వెబ్‌సైట్ పై కలిగియున్న ఏవేని గోప్యతా సెట్టింగ్స్ లేదా భద్రతా చర్యల తారుమారుకు మేము బాధ్యత వహించము. గుర్తింపు చౌర్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకొనేందుకు ఎలాంటి సహాయం కావాలో సమాచారం కోసం దయచేసి ఫెడరల్ ట్రేడ్ కమీషన్ యొక్కవెబ్‌సైట్ చూడండి.

తృతీయ పక్ష వెబ్‌సైట్లు మరియు అడ్వర్టైజింగ్

ఈ గోప్యతా నోటీసు కేవలం BibleProject చే సేకరించబడిన సమాచారానికి మాత్రమే వర్తిస్తుంది. మా వాడుకదారులకు ఒక సేవగా మేము మా వెబ్‌సైట్ నుండి తృతీయ పక్ష వెబ్‌సైట్లకు లింకులు ఇవ్వవచ్చు, ఐతే మాకు నియంత్రించే సమర్థత లేదు, మరియు తృతీయ పక్ష వెబ్‌సైట్ల యొక్క గోప్యత మరియు డేటా సేకరణ, వాడకము, మరియు వెల్లడింపు ఆచరణలకు మేము జవాబుదారీ కాదు. మిమ్మల్ని బయటి వెబ్‌సైట్లకు తీసుకువెళ్ళే లింక్‌లపై మీరు క్లిక్ చేసినప్పుడు, మీరు మా వాటికి కాక, వారి గోప్యతా నోటీసులు మరియు విధానాలకు లోబడి ఉంటారు. వారికి ఏదైనా సమాచారమును ఇచ్చే ముందు అట్టి వెబ్‌సైట్ల యొక్క గోప్యతా నోటీసులను మీరు సమీక్షించి, అర్థం చేసుకోవాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తాము.

వినియోగ షరతులు

ఈ గోప్యతా నోటీసులో చేర్చబడని విషయాలన్నింటినీ ఈ వెబ్‌సైట్ యొక్క వాడకపు షరతులు శాసిస్తాయి. మా వినియోగ షరతులతో  వినియోగ షరతులతోమీకు మీరుగా సుపరిచితులు కావడానికి మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తాము.

మా గోప్యత విధానానికి మార్పులు

ఈ గోప్యతా నోటీసు యొక్క ఖచ్చితత్వాన్ని సరిచూసుకోవడానికి మేము సమయానుగుణంగా దీనిని మార్చవచ్చు. ఒకవేళ మేము మార్పులు చేసినట్లయితే, పునస్సమీక్షించబడిన నోటీసు ఈ పేజీపై పోస్టు చేయబడుతుంది. ఈ గోప్యతా నోటీసుకు మార్పులను జోడించిన తర్వాత మా వెబ్‌సైట్ లేదా ఇతర సేవల వాడకమును మీరు కొనసాగిస్తే, ఈ మార్పులను మీరు స్వీకరించారని అర్థం. కొన్ని సందర్భాలలో, మీ సమాచారాన్ని సేకరించే సమయంలో పేర్కొన్నదానికి భిన్నమైన రీతిలో వాడకం గురించి మీకు ఎంపికలను ఇవ్వడానికి గాను మీరు ఇచ్చిన సంప్రదింపు సమాచారాన్ని ఉపయోగించి మిమ్మల్ని సంప్రదించడానికి మేము ప్రయత్నించవచ్చు. నోటీసు యొక్క ప్రస్తుత పరిధిని నిర్ధారించడానికి గాను, ప్రత్యేకించి మీరు మాకు వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చే ముందుగా, దయచేసి తరచుగా వెనక్కి చూసుకుంటూ ఉండండి.

అనధీకృత వాడకము

BibleProject కు పిల్లల సమాచారముతో సహా ఏదైనా సమాచారము యొక్క అనధీకృత సమర్పణ సమర్పణ గురించి మీకు తెలిసినట్లయితే, ఈ దిగువ జాబితా చేయబడిన సంప్రదింపు సమాచారముపై సంప్రదించడం ద్వారా దయచేసి మాకు తెలియజేయండి, తద్వారా మేము దానిని తొలగించవచ్చు.

సంప్రదింపు సమాచారము

మీ వ్యక్తిగత సమాచారము మీద మీ హక్కులలో దేనినైనా చెలాయించుటకు గాను, మీ వ్యక్తిగత సమాచారము యొక్క మా సేకరణ మరియు వాడకము గురించి ప్రశ్నలు అడగండి లేదా ఈ గోప్యతా నోటీసు మరియు గోప్యతా ఆచరణల గురించి వ్యాఖ్య చేయండి, మమ్మల్ని సంప్రదించండి:

టోల్ ఫ్రీ: (855) 700-9109

ఇ-మెయిల్: webmaster@bibleproject.com

 

By using this website, I acknowledge that I am 16 years of age or older, and I agree to the Terms and Conditions and Privacy Policy.
Under 16?
Accept
For advanced bible reading tools:
Login  or  Join
Which language would you like?